Breaking News

నల్ల చట్టాలు తేవడంలో కూటమి సర్కార్‌ ముందుంది: మల్లాది విష్ణు

Published on Tue, 11/26/2024 - 14:21

సాక్షి, విజయవాడ: ఏపీలో సోషల్‌ మీడియాను నియంత్రించే విధంగా కొత్త చట్టాలు తేవడం దారుణమన్నారు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. నల్ల చట్టాలు తేవడంలో కూటమి ప్రభుత్వం ముందు వరుసలో ఉందంటూ ఘాటు విమర్శలు చేశారు.

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడలోని సింగ్ నగర్‌లో పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బీఆర్‌ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘రాజ్యాంగం ప్రతీ పౌరుడికి భద్రత, హక్కులు, స్వేచ్ఛ కల్పించింది. కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ బయటకు వచ్చినప్పుడు భద్రత కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకుంటోంది.

కూటమి ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తోంది. సోషల్ మీడియాను నియంత్రించే విధంగా కొత్త చట్టాలు తేవటం దారుణం. నల్ల చట్టాలు తేవడంలో కూటమి ప్రభుత్వం ముందుంది. ఆంధ్ర రాష్ట్రంలో వినూత్నమైన పరిపాలన జరుగుతోంది. ప్రజల  హక్కులు హరించబడుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వైఎస్‌ జగన్‌పై దుష్ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచింది. రాజ్యాంగం అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం వద్ద అధికారులు ఎందుకు నివాళులర్పించలేదు?. ప్రభుత్వం, అధికారులు వివక్షత చూపిస్తున్నారు’ అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇది కూడా చదవండి: AP: సోషల్‌ మీడియా కార్యకర్తలపై పెరిగిన వేధింపులు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)