Breaking News

డైవర్షన్‌ పాలిటిక్స్‌లో చంద్రబాబు దిట్ట: కైలే అనిల్‌ కుమార్‌

Published on Sat, 07/13/2024 - 17:05

సాక్షి, తాడేపల్లి: అసైన్డ్‌ భూముల విషయంలో ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందన్నారు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌. ఎప్పుడూ చంద్రబాబు భజనే తప్ప పేదల బాగోగులు ఎల్లో మీడియాకు పట్టదా? అని ప్రశ్నించారు. అసైన్డ్‌ భూముల విషయంలో అక్రమాలు చేసిందే చంద్రబాబు అని అన్నారు.

కాగా, అనిల్‌ కుమార్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అసైన్డ్‌ భూముల విషయంలో పేదల కోసం తెచ్చిన చట్టాన్ని కూడా తప్పు దారి పట్టించేలా ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోంది. ప్రభుత్వ హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేలా ఎల్లో రాతలు రాస్తున్నారు. చంద్రబాబు భజనే తప్ప పేదల బాగోగులు ఎల్లోమీడియాకు పట్టదా?. 

ఎసైన్డ్‌ భూముల విషయంలో అక్రమాలు చేసిందే చంద్రబాబు. రాజధానిలో 1,336 మంది పేదల నుండి అసైన్డ్‌ భుములను లాక్కున్నదే చంద్రబాబు. అలాంటి వారు నేడు అసైన్డ్‌ భూముల గురించి మాట్లాడటమేంటి?. గతంలో పేదోడికి కష్డం వస్తే ఆ అసైన్డ్‌ భూములను అమ్ముకునే పరిస్థితి కూడా లేదు. అలాంటి కష్టాల నుండి పేదలను కాపాడటానికే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రత్యేక చట్టం తెచ్చారు. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేశాకే చట్టం తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో 2.88 లక్షల ఎకరాలపై గిరిజనులకు హక్కులు కల్పించారు. లక్షలాది ఎకరాల అసైన్డు భూములను పేదలకు పట్టాలుగా ఇచ్చారు.

డైవర్షన్ పాలిటిక్స్ చేయటంలో చంద్రబాబు దిట్ట. ఏదో చేసేస్తున్నట్టు మీడియాలో హడావుడి చేస్తున్నారు. తల్లికి వందనం పేరుతో పిల్లలు అందరికీ ఇవ్వాల్సిన రూ.15 వేల నగదు ఇవ్వలేదు. ఇతర హామీలనూ గాలికి వదిలేశారు. వాటి గురించి ప్రశ్నిస్తారనే ఎల్లోమీడియాతో కలిసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. 45ఏళ్ల రాజకీయ చరిత్ర ఉందనే చంద్రబాబుకు ఏనాడూ ఎస్సీ, ఎస్టీలు గుర్తుకు రాలేదు.

అమరావతిలో పేదల భూములను పెద్దోళ్లకు కట్టబెట్టినట్టే మరో కుట్ర జరుగుతోంది. అందుకే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అసైన్డ్‌ భూములపై తప్పుడు కథనాలు రాయిస్తున్నారు. చంద్రబాబు ఎన్నిసార్లు సీఎం అయినా ఏనాడైనా ఒక్క పేదోడికైనా సెంటు భూమి ఇచ్చారా?. ఏ ప్రభుత్వ ఆఫీసు చుట్టూ తిరగకుండానే పేదులకు పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌ది. బాధ్యత కలిగిన పత్రికలు వాస్తవాలు రాయాలని కోరుతున్నాను అంటూ కామెంట్స్‌ చేశారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)