Breaking News

‘సాయికృష్ణ ఘటన సీపీకి తెలిసే జరిగింది’

Published on Thu, 06/18/2026 - 12:01

సాక్షి, తాడేపల్లి: ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనమైందని వైఎస్సార్‌సీపీ నాయకులు దేవినేని అవినాష్ ఆరోపించారు. సీపీగా రాజశేఖర్ బాబు వచ్చాక విజయవాడ గాడి తప్పిందని సంచలన ఆరోపణలు చేశారు. దేశ చరిత్రలో ఎక్కడా జరగని ఘోరం విజయవాడలో జరిగింది. పోలీసులే యువకుడిని కొట్టి చంపేసి, కాల్చి బూడిద చేశారు అంటూ వ్యాఖ్యలు చేశారు.

గాదె సాయికృష్ణ ఘటనపై దేవినేని అవినాష్ స్పందిస్తూ..‘విజయవాడ నగరంలో పోలీసులు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు. రెండేళ్లుగా గంజాయి విక్రయాలు, సెటిల్మెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. నగరంలో లా అండ్ ఆర్డర్‌ని సీపీ రాజశేఖర్ బాబు గాలికి వదిలేశారు. దర్జాగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంటే సీపీ పట్టించుకోవడం లేదు. రౌడీ షీటర్స్ నడిరోడ్డుపై ప్రజల్ని ఇబ్బంది పెడుతూ దర్జాగా తిరుగుతున్నారు. పేకాట క్లబ్‌లు విచ్చలవిడిగా నడుస్తున్నా సీపీ పట్టించుకోరు.

సాయికృష్ణ ఘటన సీపీకి తెలిసే జరిగింది. సీపీ బాధ్యత వహించాలి సమాధానం చెప్పాలి. సీపీ ఎందుకు మాట్లాడటం లేదు?. వైఎస్సార్‌సీపీ నేతల్ని వేధించడంలో సీపీ రాజశేఖర్ బిజీగా ఉన్నారు. చంద్రబాబు, లోకేష్ కళ్లలో ఆనందం చూడటానికే సీపీ పని చేస్తున్నాడు. సీఎం, డిప్యూటీ సీఎం సమావేశమై బాధిత కుటుంబానికి ఏం న్యాయం చేశారు?. మీ పార్టీల జెండాలు పట్టుకుని ఎన్నికల్లో తిరిగిన కుటుంబానికి మీరు ఇచ్చిన భరోసా ఏది?. సాయికృష్ణను కొట్టి చంపేసి కాల్చి బూడిద చేశారు. ఇదే నిజం. బాధిత కుటుంబానికి అండగా ఉండాల్సిన స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కనీసం పరామర్శించలేదు. జనసేన ఇంచార్జ్ అమ్మిశెట్టి వాసు ఏకంగా డబ్బులిస్తామని సెటిల్మెంట్ చేస్తున్నాడు’ అంటూ విమర్శలు గుప్పించారు. 

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు