Breaking News

నకిలీ మద్యం కేసులో ఐవిఆర్ఎస్ కాల్స్‌పై YSRCP ఫిర్యాదు

Published on Fri, 10/24/2025 - 13:36

సాక్షి, తాడేపల్లి: నకిలీ మద్యం కేసులో ఐవిఆర్ఎస్ (interactive Voice Response System) కాల్స్‌పై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆ పార్టీ నేతలు నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు ప్రస్తావిస్తూ ఐవిఆర్ఎస్ కాల్స్ చేయటంపై ఫిర్యాదు చేశారు.

డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినవారిలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ‘‘నాపై ఐవిఆర్ఎస్ కాల్స్‌ చేయిస్తున్న వారిపై విచారణ జరపాలి. ఆ కాల్స్ వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారు కఠిన చర్యలు తీసుకోవాలి. నాకు నకిలీ మద్యంతో సంబంధాన్ని అంటగట్టాలని ప్రయత్నిస్తున్నారు. నార్కో అనాలసిస్ టెస్టుకు కూడా నేను సిద్ధమే. ఫేక్ కాల్స్‌తో  వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. దమ్ముంటే నన్ను ఎదురుగా ధైర్యంగా ఎదుర్కోవాలి. అంతేగాని ఐవిఆర్ఎస్ కాల్స్ పేతుతో ఫేక్ కాల్స్ చేయటం ఎందుకు?’’ అంటూ ఆయన మండిపడ్డారు.

‘‘ఎక్కడి నుండి చేస్తున్నారో కూడా తెలియకుండా ఫేక్ కాల్స్ చేస్తున్నారు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం తమ చేతిలో ఉందని ఏదైనా చేయొచ్చని అనుకుంటున్నారేమో?. దమ్ము, ధైర్యం ఉంటే ఈ కాల్స్ ఎవరు చేశారో, ఎవరు చేయిస్తున్నారో చెప్పాలి. దీనిపై విచారణ జరపాలని సైబర్ క్రైం పోలీసులకు  ఫిర్యాదు చేశాం. చట్టాన్ని, టెలికం వ్యవస్థను వాడుకోవటంపై ఫిర్యాదు చేశాం. చంద్రబాబు, లోకేష్ దీని వెనుక ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలి. నా మీద చంద్రబాబు ప్రభుత్వం బురద వేసింది.

నా వ్యక్తి గత ప్రతిష్ట దెబ్బతినేలా నకిలీ మద్యం కేసును అంట గడుతున్నారు. దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా. లైడిటెక్టర్ పరీక్షకు సిద్దమని కూడా చెప్పా. నార్కో అనాలసిస్ టెస్టుకైనా నేను సిద్ధం. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటానికే టీడీపీ నేతకు నామీద, నా పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారు. దేశంలోని ఏ సంస్థతో విచారణ జరిపినా నేను సిద్ధమే’’ అని జోగి రమేష్‌ స్పష్టం చేశారు.

IVRS కాల్స్‌  
ఒక ఆటోమేటెడ్ టెలిఫోన్ సిస్టమ్, ఇది కాల్ చేసిన వ్యక్తికి ముందుగా రికార్డ్ చేసిన సందేశాలను వినిపిస్తూ, వారి ఎంపికల ఆధారంగా సమాచారాన్ని అందిస్తూ సంబంధిత విభాగానికి కాల్‌ను ఫార్వర్డ్ చేస్తుంది.   ఇప్పుడు దీనిపైనే జోగి రమేష్‌ ఫిర్యాదు చేశారు. తనకు  నకిలీ మద్యం కేసు అంటగట్టాలని  చూస్తున్నారని, అందులో భాగంగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఐవిఆర్ఎస్ కాల్స్‌ కుట్రకు తెరలేపిందని జోగి రమేష్‌ ఫిర్యాదు చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)