Breaking News

‘బాబు మోసాలను పవన్‌ ప్రశ్నించరా?’

Published on Wed, 01/29/2025 - 13:47

సాక్షి, తూర్పుగోదావరి: పేదల ద్వేషి అయిన చంద్రబాబు నాయుడు..  ప్రజల్ని మోసం చేయడమే లక్ష్యంగా  పని చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై  కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై.. బుధవారం రాజమండ్రిలో వేణుగోపాల్‌ మీడియాతో మాట్లాడారు.

‘‘తల్లికి వందనం, ఫీజు రియింబర్స్‌మెంట్‌, రైతులకు పెట్టుబడి సహాయం ఇవ్వకుండా అన్ని వర్గాలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది.  మెగా డీఎస్సీ ప్రకటిస్తానని చెప్పినా ఇప్పటిదాకా అది జరగలేదు. ఎందుకు?. ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్‌ ఎందుకు ఈ విషయాల్లో మౌనంగా ఉన్నారు?. పవన్ కళ్యాణ్ స్పందించాలి... లేదంటే చంద్రబాబు మాయలో పడి మీరు మోసపోయినట్టే..‌ అలాగే ప్రజల వద్ద నమ్మకమూ కోల్పోతారు.

ఖజానా 100 కోట్లు ఉన్న సమయంలోనే నవరత్న పథకాలను వైయస్ జగన్ అద్భుతంగా అమలు చేశారు. రాష్ట్ర ఆదాయం కూడా ఆయన హయాంలోనే పెరిగింది. 7,000 కోట్లు రూపాయలతో ఖజానా మీ చేతిలో పెడితే ఏం చేశారు?.  పదిహేను శాతం వృద్ధిరేటు దాటిన తర్వాత సూపర్ సిక్స్ అమలు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని స్పష్టమవుతోంది. పోలవరం ,అమరావతి చంద్రబాబు అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి.... చంద్రబాబు ఆస్తులు విలువ పెరుగుతుంది మినహా ప్రజలకు ఒరుగుతున్నది ఏమీ లేదు.ప్రజలు మీరు చెప్పిన హామీలు అమలు చేస్తారని ఎదురు చూస్తున్నారు ... వాటిపై దృష్టి పెట్టండి అని హితవు పలికారాయన.

చంద్రబాబు పేదల ద్వేషి. ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారు. కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పింది ఎవరు?. రాష్ట్రంలో అన్ని  ప్రాంతాల్లో భూములు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతున్నారు. మీ వాళ్ళు భూములు కొనుగోలు చేసినందుకు మీ స్వార్థం కోసం అమరావతిలో భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచకపోవడం దారుణం అని వేణుగోపాల్‌ అన్నారు.

రాష్ట్ర విభజనకు చంద్రబాబు ముఖ్య కారకుడు అయ్యాడు: వేణుగోపాలకృష్ణ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)