Breaking News

‘బాబు, పవన్, లోకేష్‌లపై కేసు పెట్టాల్సిందే’

Published on Fri, 01/30/2026 - 13:39

సాక్షి, తూర్పుగోదావరి: తిరుమల విషయంలో కోట్లాది హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీశారని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మాజీ ఎంపీ మార్గాని భరత్‌ ప్రశ్నించారు. చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు. ఇంతా జరుగుతున్నా సనాతని పవన్‌ ఎక్కడికి వెళ్లిపోయారు. అప్పుడు ఊగిపోయిన పవన్‌.. ఇప్పుడు కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు.

మాజీ ఎంపీ మార్గాని భరత్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూలో ఏ విధమైన జంతు కొవ్వు లేదని సీబీఐ ‍స్పష్టం చేసింది. జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని చంద్రబాబు ఏ విధంగా నిర్ధారించారో చెప్పాలి. గతంలో జంతువుల కొవ్వు కలిసిందని దారుణంగా మాట్లాడారు. రెండు రిపోర్టుల్లో యానిమల్ ఫ్యాట్ కలవలేదని స్పష్టమైన నివేదికలు వచ్చాయి. కోట్లాది హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీశారు. యానిమల్ ఫ్యాట్ అనే పదం ఎందుకు ఉపయోగించారు?. చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిశాయని లోకేష్ మాట్లాడారు. ఇంత జరుగుతుంటే సనాతని పవన్‌ ఎక్కడికి పోయారు?.

తిరుపతి వెంకన్న గురించి గానీ, లడ్డు గురించి గానీ ఇలా ఇంకెవరైనా మాట్లాడితే ఊరుకుంటారా?. ఇలా మాట్లాడటానికి, ఆరోపణలు చేయడానికి వీరికెవరు అధికారం ఇచ్చారు?. దేవుని గురించి మాట్లాడేందుకు వీరికేమైనా మినహాయింపు ఉందా?. 2018లో 23 లక్షల కిలోల నెయ్యి ఆర్డర్ 320/- చొప్పున చంద్రబాబు హయాంలో ఆర్డర్  ఇచ్చారు. జైనులను కూడా ఈ వ్యవహారంలో దోషులుగా చేర్చారు. మాంసాహారం అంటేనే జైనులు ఆమడ దూరంలో ఉంటారు.. చీమకు కూడా హాని చేయరు.. అటువంటి వారిని కూడా ఇరికించారు. కొవ్వుతో కలిపి తయారు చేసిన లడ్డులను అయోధ్య కూడా పంపించారని ఇష్టారీతిన పవన్ మాట్లాడేసాడు. ఇటువంటి వ్యక్తులను ఏం చేయాలి?. హైకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని వీరిపై కేసు నమోదు చేయాలి. నిజంగా చంద్రబాబు, పవన్, లోకేష్ తిరుమలలో మెట్లపై ముక్కు నేలకు రాసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను క్షమాపణ కోరాలి.

పవన్ కళ్యాణ్ మాటలు తప్పు కాదా?. హిందూ ఛాంపియన్స్ అని చెప్పుకునే బీజేపీ ఎందుకు ఈ విషయంలో స్పందించడం లేదు?. ఎందుకు చంద్రబాబును కూటమి నుంచి తొలగించడం లేదు. రాజకీయాలకు లొంగిపోతున్నారా?. చంద్రబాబును ఎలా క్షమిస్తున్నారు?. వీరిని వెంకటేశ్వరుడు కచ్చితంగా ఈ జన్మలోనే శిక్షిస్తాడు. భక్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు చేసిన ఆరోపణలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎటువంటి ఆధారాలు లేకుండా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆరోపణలు చేయడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)