Breaking News

కూటమి బడ్జెట్‌ మోసాలను ప్రశ్నిస్తే అడ్డుకుంటారా?: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు

Published on Thu, 11/14/2024 - 14:48

సాక్షి, తాడేపల్లి: మండలిలో మాట్లాడుతుంటే మంత్రులు పదేపదే అడ్డు తగులుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. ఏపీ శాసన మండలి మీడియా పాయింట్‌ వద్ద వారు మాట్లాడుతూ 3 సిలిండర్లు ఇస్తామని ఈ ఏడాది 2 సిలిండర్లకు ఎగనామం పెట్టారని ధ్వజమెత్తారు. రూ.5,387 కోట్లు ఇస్తే తల్లికి వందనం ఎలా అమలు చేస్తారు? అని ప్రశ్నించారు.

కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది: వరుదు కల్యాణి
ప్రశ్నిస్తే గొంతును నొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. రైతులకు పెట్టుబడి సాయం ఇప్పటివరకు ఇవ్వలేదు. రైతులకు కేటాయించిన రూ.వెయ్యి కోట్లు ఎప్పుడిస్తారో చెప్పలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా జగన్‌ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం విధ్వంసమంటారా?. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పోర్టులు కట్టడం చీకటి పాలన అవుతుందా?. ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ను మంత్రులు దెబ్బతీయాలని చూస్తున్నారు.

బడ్జెట్‌పై చర్చ పక్కదారి: తోట త్రిమూర్తులు
బడ్జెట్‌పై చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. పవర్ సెక్టార్‌పై చర్చ జరగకుండా చేశారు. పలు సమావేశాల్లో కరెంట్ ఛార్జీలు పెంచనని చంద్రబాబు చెప్పారు. ఒక్క రూపాయి ఛార్జీ పెంచనని చెప్పి ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు. తమ మోసాన్ని ప్రజలకు తెలియకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ సందర్భం లేని చర్చను తెరపైకి తెచ్చారు. బడ్జెట్ పై వరుదు కళ్యాణి మాట్లాడుతుంటే మా తల్లిని అవమానించారంటూ లోకేష్ చర్చను తప్పుదారి పట్టించారు. గతంలో ఎప్పుడూ లేని పరిస్థితులను సభలో చూస్తున్నాం. సోషల్ మీడియై పోస్టులపై చర్చకు కోరితే అడ్డుకున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియకూడదనే టీడీపీ ఎమ్మెల్సీలు వ్యవహరిస్తున్నారు. సూపర్ సిక్స్‌లు అమలు చేయకుండా కూటమి నేతలు ప్రజలను మోసం చేస్తున్నారు.

సూపర్ సిక్స్ ని నమ్మి ఓటేశారు.. ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది

ఇదీ చదవండి: బడ్జెట్‌పై వరుదు కల్యాణి ప్రశ్నలు.. పదేపదే అడ్డుకున్న టీడీపీ మంత్రులు

 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)