Breaking News

‘బాబూ.. ఒక్కో రైతుకు 20వేల ఆర్థిక సాయం ఏమైంది?’

Published on Sat, 12/07/2024 - 11:37

సాక్షి, అనంతపురం: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేదన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో రైతు సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైనట్టు తెలిపారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబుది అసమర్థత పాలన. హామీలను అమలు చేయడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం విఫలమైంది. రైతు సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధం. ఈనెల 13వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమం జరుగుతుంది. అనంతపురంలో ర్యాలీ, అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తాం. రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతుకు 20వేల ఆర్థిక సాయం ఏమైంది?. ధాన్యం కొనుగోలు, మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందన్నారు.

మాజీ ఎంపీ తలారి రంగయ్య మీడియాతో మాట్లాడుతూ..‘రైతులకు భరోసా కల్పించడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. రైతులకు ఇచ్చిన హామీలను టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేదు. ఈనెల 13వ తేదీన వైఎస్సార్‌సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతం చేయండి అని పిలుపునిచ్చారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)