Breaking News

క్రెడిట్‌ కొట్టేయగల సమర్థుడు చంద్రబాబు: అంబటి

Published on Sat, 08/30/2025 - 17:43

కుప్పానికి, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబుకి ఏనాడూ రాలేదని.. ఆయన ఆడే నాటకాలు, మోసాలు జనాలకు బాగా తెలుసుని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం పనులు సరైన, సక్రమమైన పద్ధతుల్లో జరగడం లేదంటూ శనివారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్రకార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు.

సాక్షి, గుంటూరు: కుప్పానికి, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబుకి ఏనాడూ రాలేదని.. ఆయన ఆడే నాటకాలు, మోసాలు జనాలకు బాగా తెలుసుని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..

సొమ్మొకడిది.. సోకొకడిది అన్నట్లు ఉంది చంద్రబాబు వ్యవహారం. పని చేసేది ఒకరు.. క్రెడిట్‌ పొందేది మరొకరు. క్రెడిట్‌ను దొంగిలించగలిగిన సమర్థుడు చంద్రబాబు ఆరితేరారు. కుప్పానికి మొన్న నీళ్లు ఇచ్చానని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, 1989 నుంచి ఆయనే అక్కడ పోటీ చేస్తున్నారు. కుప్పానికి 2024 ఫిబ్రవరి 26న జగన్‌ నీళ్లు ఇచ్చారు. కానీ, చంద్రబాబు లైనింగ్‌ పేరిట సీఎం రమేష్‌ కంపెనీకి అప్పనంగా డబ్బులు ఇచ్చారు.. 

.. ప్రపంచంలోనే పోలవరం చాలా క్లిష్టమైన ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టును చంద్రబాబు తన హయాంలో గాలికి వదిలేశారు. రెండు కాపర్‌డ్యామ్‌లను 2018లో ప్రారంభించారు. వాటి జీవిత కాలం మూడేళ్లు మాత్రమే. డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోవడానికి చంద్రబాబే కారకుడు.  ఆయన చేసిన పనికి అంతర్జాతీయ నిపుణులే తలలు పట్టుకున్నారు. పోలవరం నాశనం చేసింది ముమ్మాటికీ చంద్రబాబే. 

పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు, రామానాయుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు

చంద్రబాబు, రామానాయుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.  ఆయన రామా నాయుడా? డ్రామా నాయుడా?. సరైన, సక్రమ పద్దతుల్లో పోలవరం నిర్మాణం జరగడం లేదు. డయాఫ్రం వాల్‌ 1.5 మీటర్ల వెడల్పు ఉండాలి. రాక్‌ తగిలే వరకు డయాఫ్రం వాల్‌ వేయాలి. కానీ, చంద్రబాబు నాయకత్వంలో 0.9 మీటర్లు మాత్రమే వేస్తున్నారు. కమీషన్ల కోసం చంద్రబాబు కక్కుర్తి పడుతున్నారు. 

పోలవరం ప్రాజెక్టుపై అనుమానాలకు ప్రధాన కారకుడు చంద్రబాబు. ఆయన అంతర్జాతీయ నిపుణుల సలహాలు కూడా వినడం లేదు. పోలవరం ప్రాజెక్టుపై మేం చర్చకు సిద్ధం.. ఇది సవాల్‌ కాదు చర్చకు రావాలని చంద్రబాబును రిక్వెస్ట్‌ చేస్తున్నా’’ అని అంబటి అన్నారు.

Videos

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)