బాబుది చారిత్రక తప్పిదం: వైఎస్‌ జగన్‌

Published on Sat, 11/01/2025 - 11:37

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

‘‘పొట్టి శ్రీరాములుగారి అహింసా దీక్షతో, ప్రాణత్యాగంతో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలుగువారి ఆత్మగౌరవంకోసం అలుపెరగని పోరాటం చేశారాయన. పొట్టి శ్రీరాములుగారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. 

.. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని జరపకుండా చంద్రబాబుగారి ప్రభుత్వం చారిత్రక తప్పిదాలకు పాల్పడుతూనే ఉంది. పొట్టి శ్రీరాములుగారి త్యాగాన్ని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే. రాష్ట్ర అవతరణ దినోత్సవం రాజకీయాలకు అతీతంగా జరగాలి’’ అని ఎక్స్‌ ఖాతాలో కోరారాయన. 

 

భాషా ప్రతిపాదికన.. 1956లో నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అప్పటి నుంచి 58 ఏళ్లపాటు ఆ తేదీనే అవతరణ దినోత్సవంగా నిర్వహిస్తూ వచ్చాయి ప్రభుత్వాలు. 2014, జూన్‌ 2వ తేదీన తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి. వైఎస్సార్‌సీపీ హయాంలోనూ ఆ వేడుకలు జరిగాయి. అయితే 2024లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా జరపడం లేదు. అందువల్ల కూటమి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో.. 

శనివారం తాడేపల్లిలోని YSRCP కేంద్ర కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు నివాళులర్పించారు. ప్రభుత్వం వేడుకలను నిర్వహించకపోవడాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్రంగా తప్పుబట్టారు. 

‘‘పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అలాంటిది ఆయన త్యాగానికి చంద్రబాబు విలువ లేకుండా చేశారు. ప్రభుత్వం తరపున పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. రాష్ట్రంలో ఆర్యవైశ్యలే  చందాలు వసూలు చేసుకుని పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టుకోమని లోకేష్ సూచించారు. అందుకే మండలాలు, జిల్లాల వారీగా టార్గెట్ పెట్టి చందాలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టలేని స్థితిలో ఉందా?. ఎన్టీఆర్ విగ్రహానికి వందల కోట్లు ఖర్చు పెడతారుగానీ.. పొట్టి శ్రీరాములుని మాత్రం విస్మరిస్తారా?. ఇది సరైన నిర్ణయం కాదు. ప్రభుత్వమే పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. వైశ్యుల దగ్గర చందాలు వసూలు చేస్తామంటే సహించం’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)