Breaking News

చంద్రబాబు మరో అబద్ధం.. వైఎస్‌ జగన్‌ కౌంటర్‌

Published on Sat, 09/28/2024 - 09:51

సాక్షి, అమరావతి: గోబెల్స్‌ ప్రచారాల్లో చంద్రబాబును మించిన వాళ్లు మరెవరూ లేరనే విషయం.. మరోసారి రుజువైంది. అబద్ధాల్ని సృష్టించడం.. వాటిని అంతే అందంగా అమ్ముకోవడంలో ఆయనకంటూ ఓ ప్రత్యేకత ఉంది. ముఖ్యమంత్రిలాంటి ఉన్నతస్థానంలో ఉండి.. అదీ మీడియా ముందుకు వచ్చి పచ్చిగా అబద్ధాలు ఆడడం ఆయనకు మాత్రమే చెల్లుతుంది కూడా.  

తాజాగా.. వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన నేపథ్యంతో నిన్నంతా నడిచిన నాటకీయ పరిణామాలు తెలిసిందే. దీనిపై ప్రెస్‌మీట్‌ నిర్వహించిన సీఎం చంద్రబాబు.. జగన్‌ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  కూడా అంతే స్ట్రాంగ్‌గా‌ చంద్రబాబుకి కౌంటర్‌ ఇచ్చారు.

YS Jagan Press Meet on Tirumala Tour And Tirupati Prasadam Controversy‪ Photos1

‘‘జగన్‌ను తిరుమలకు వెళ్లవద్దని ఎవరన్నారు. ఆయన్నేదో(జగన్‌ను ఉద్దేశిస్తూ..) ఆపేశారని.. నోటీసులు ఇచ్చారని మాట్లాడుతున్నారు. సూటిగా అడుగుతున్నా.. నిన్ను వెళ్లవద్దని ఎవరైనా ఆపారా?. నోటీసులు ఉంటే మీడియాకు చూపించండి. ప్రజా జీవితంలో ఉండే మనం కొన్ని పాటించాల్సి ఉంటుంది’’ అని చంద్రబాబు మాట్లాడారు.  అయితే.. ఈ వ్యాఖ్యలపై జగన్‌ స్పందించారు.

‘‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అనే వ్యక్తి.. తిరుమల తిరుపతి దేవస్థానంలో దైవాన్ని దర్శించుకునేందుకు వెళ్తాను అంటే.. పర్మిషన్‌ ఇవ్వడం లేదు. ఆ కార్యక్రమంలో ఎవరూ పాలు పంచుకున్నా.. అందరినీ అరెస్ట్‌ చేస్తాం అని నోటీసులు ఇస్తున్నారు. ఆలయానికి వెళ్తామంటే నోటీసులు ఇవ్వడమేంటో? అసలు ఏ ప్రపంచంలో ఉన్నాం. ఇది రాక్షస రాజ్యం కాదా? అని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నోటీసుల్లోని విషయాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు కూడా. దీంతో చంద్రబాబు తప్పుడు ప్రచారం.. బయటపడింది.

 

ఇదీ చదవండి: కల్తీ.. బాబు సృష్టే!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)