Breaking News

దెబ్బ తిన్న వాళ్లు రేపు నా మాట కూడా వినరు: వైఎస్‌ జగన్‌

Published on Wed, 07/16/2025 - 12:48

సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో ఏం జరుగుతోంది అన్నది అందరూ చూస్తున్నారు.. చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలి అని  వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు. బీహార్‌లో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యేలపై దాడులు చేయడమేంటి?. ప్రజా ప్రతినిధులకు పోలీసులు గన్‌ చూపించి బెదిరిస్తారా? అని ఆగ్రహం​ వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తాడిపత్రిలో ఓ మాజీ ఎమ్మెల్యే (కేతిరెడ్డి పెద్దారెడ్డి) తన సొంత ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఉంది. హైకోర్టు ఆదేశాలున్నా.. పోలీసులు అడ్డుతగులుతున్న పరిస్థితి కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యేకు పోలీసులు.. గన్‌ చూపించమేంటి?. మనం ఎక్కడ ఉన్నాం. ఆరు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై పచ్చ సైకోలు.. అదీ పోలీసుల సమక్షంలోనే దాడికి ప్రయత్నించారు. పోలీసులు అక్కడే ఉన్నా.. పచ్చ బ్యాచ్‌ను అడ్డుకోలేదు. ఆటవిక రాజ్యంలో ఉన్నామా?. చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలి.

బాధితుడు నల్లపురెడ్డి మీదనే కేసు పెట్టారు. ఇది శాడిజం కాదా?. కాకాణి, వంశీ, మిథున్‌ రెడ్డి, చెవిరెడ్డి, నందిగం సురేష్‌, పిన్నెల్లి, పోసాని సహా ఎంతో మందిపై తప్పుడు కేసులు పెట్టారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాస్‌పై కూడా కేసు పెట్టారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి మచ్చ లేని అధికారులు. వారి మీద కూడా అక్రమ కేసులు పెట్టారు. ఎంతో మంది అమాయకులపైనా తప్పుడు కేసులు బనాయించారు. తప్పుడు వాంగ్మూలతో ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు రాజకీయాల్లో దుష్ట సంప్రదాయం తెచ్చారు. మా ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు పరిస్థితి ఏంటి?. చంద్రబాబు నీ తప్పుడు సంప్రదాయం విష వృక్షం అవుతుంది. మా ప్రభుత్వం వచ్చాక ప్రతి చర్యగా వీళ్లు కూడా ఇదే చేస్తే పరిస్థితి ఏంటి?. 

చంద్రబాబు ఇప్పటికైనా మారకపోతే వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉండదు. దెబ్బ తగిలిన వాడికే బాధ తెలుస్తుంది. మేం అధికారంలోకి వచ్చాక మా వాళ్లు నా మాట కూడా వినరు. ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు. మా ప్రభుత్వం వచ్చాక వడ్డీ సహా చెల్లిస్తాం.’ అంటూ హెచ్చరించారు. 

Videos

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)