Breaking News

‘పాలన చేతకాదా చంద్రబాబూ?’.. మీడియా ముందు నిలదీయనున్న వైఎస్‌ జగన్‌

Published on Wed, 11/20/2024 - 09:14

గుంటూరు, సాక్షి: నిత్య అబద్ధాలు.. పాలనలోనూ గారడీ చేస్తున్న కూటమి సర్కార్‌ను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ నిలదీయనున్నారు. కాసేపట్లో తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా ద్వారా మాట్లాడనున్నారు

ఏపీలో అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే అరాచక పాలన మొదలుపెట్టింది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. ఒకవైపు వైఎస్సార్‌సీపీపై ప్రతీకార రాజకీయాలు కొనసాగిస్తూనే.. మరోవైపు కీలక హామీల విషయంలో ప్రజలను మోసం చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఐదు నెలలు గడిచినప్పటికీ ఎన్నికల హామీల్లోని ఏ ఒక్క పథకం అమలు చేయకపోగా.. జగన్‌ పాలనలో సమర్థవంతంగా సాగిన వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ పోతోంది.

రైతులు, విద్యార్థులు, ఆడపడుచులు.. ఇలా అన్నివర్గాలు బాబు సర్కార్‌ చేతిలో మోసపోతున్నారు. జగన్‌ హయాంలోని సంక్షేమ లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో తగ్గిస్తూ వస్తోంది ప్రస్తుత ప్రభుత్వం.  గత వైఎస్సార్‌సీపీ పాలనపై అడ్డగోలుగా ఆరోపణలు గుప్పిస్తూ కాలం వెల్లదీసే ప్రయత్నం చేస్తోంది. వీటన్నింటిని తోడు.. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోనూ కూటమి ప్రభుత్వ కుట్రల పర్వం కొనసాగుతోంది.

కనీసం అసెంబ్లీలో అయినా గళం వినిపించే అవకాశం లేకపోవడంతో మీడియా చంద్రబాబు సర్కార్‌ను నిలదీస్తున్నారు వైఎస్‌ జగన్‌. గత సమావేశంలో బడ్జెట్‌ లెక్కలను తీసి మరీ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడి.. చంద్రబాబు సర్కార్‌కు పలు ప్రశ్నాస్త్రాలు సంధించే అవకాశం ఉంది. 

YS జగన్ సంచలన ప్రెస్ మీట్

 ఇదీ చదవండి: బూచిగా అప్పుల భూతం.. సూపర్‌ సిక్స్‌కు ఎగనామం

ఇదీ చదవండి: అభివృద్ధిపైనా అబద్ధాలే

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)