Breaking News

కోటి సంతకాల ఉద్యమం.. ఒక చరిత్ర: వైఎస్‌ జగన్‌

Published on Thu, 12/18/2025 - 12:20

సాక్షి, తాడేపల్లి: ఒక గొప్ప ఉద్యమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని.. చర్రితలో ఇంత పెద్ద ఎత్తున సంతకాల ఉద్యమం జరగలేదని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఆ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామస్థాయి కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరికీ వైఎస్‌ జగన్‌ అభినందనలు తెలిపారు.

‘‘మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌కు కట్టబెట్టడమే పెద్ద స్కాం. మళ్లీ రూ. 120 కోట్ల ప్రజాధనాన్ని జీతాల కింద ఎలా ఇస్తారు?. కాలేజీలు ప్రైవేటుకు ఇచ్చి జీతాలు మీరు ఎలా ఇస్తారు?. ఇంతకంటే పెద్ద స్కాం ఉంటుందా?’’ అంటూ వైఎస్‌ జగన్‌.. చంద్రబాబు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘కోటి సంతకాలు లోక్‌భవన్‌కు చేరుకున్నాయి. కోటి 4 లక్షల 11 వేల 136 మంది సంతకాలు ఒక చరిత్ర. చంద్రబాబు గ్రాఫ్‌ పడిపోతూ ఉంది. ఈ మాట చంద్రబాబే చెప్పుకున్నారు. కూటమి పాలనలో ప్రజలకు మంచి జరగలేదు. 2 బడ్జెట్‌లు పెట్టినా ప్రజలను జరిగిన మంచి గుండుసున్నా. మన హయాంలో పథకాల అమలుకు క్యాలెండర్‌ ఇచ్చాం. బాబు సూపర్‌సిక్స్‌, సూపర్‌  సెవెన్‌ అంటూ మోసం చేశారు. మన హయాంలో పథకాలన్నీ చంద్రబాబు రద్దు చేశాడు’’ అంటూ వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

‘‘కూటమి పాలనలో వ్యవస్థలు కుప్పకూలాయి. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేదు. అన్నదాతలకు రైతు భరోసా అందడం లేదు. ప్రైవేటీకరణ అంటేనే దోపీడీ. విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. మన హయాంలో ఆర్టీసీని బతికించాం. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. కూటమి పాలనలో అన్ని వ్యవస్థలు తిరోగమనం. చంద్రబాబు తప్పులు చేసి కలెక్టర్లపైకి నెట్టేస్తున్నారు. అక్టోబర్‌ 7న సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. అక్టోబర్‌ 9న నర్సీపట్నం మెడికల్‌ కాలేజీని సందర్శించా. అక్టోబర్‌ 10 నుంచి డిసెంబర్‌ 10 వరకు సంతకాల ఉద్యమం సాగింది’’ అని వైఎస్‌ జగన్‌ వివరించారు.

 

 


 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)