Breaking News

కృష్ణా జలాలు వైఎస్సార్‌ పుణ్యమే: వైఎస్‌ అవినాష్‌రెడ్డి

Published on Mon, 12/29/2025 - 13:10

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటూ నిలదీశారు. ‘‘చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఐదు లక్షల మంది పెన్షన్లు కట్‌ చేశారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయి?. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణతో ప్రజలు నష్టపోతారు.’’ అని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.

పేదలందరికీ రేషన్ బియ్యం  అందాలన్నదే తమ ఆలోచన.. 8 వేల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందజేయాలన్న అవినాష్‌రెడ్డి.. రూ.480 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ పథకం ప్రారంభించింది మేమే. వాటర్ గ్రిడ్ స్కీముకు వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. పాపాఘ్ని నది నుంచి ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. దొంగతనాలు, మట్కా, జూదం విచ్చలవిడిగా జరుగుతున్నాయని ధ్వజమెత్తారు.

‘‘వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడంలో చంద్రబాబు సర్కార్‌ ఘనత సాధించింది. ప్రతి మహిళకు రూ.18 వేలు డబ్బులు ఇస్తామన్నారు. నిరుద్యోగ అభివృద్ధి రూ.3వేలు ఇస్తామన్నారు. రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు.. ఎక్కడ ఇస్తున్నారు? 66 లక్షల పెన్షన్లు వచ్చేవి.. మీ ప్రభుత్వం వచ్చాక ఐదు లక్షల పెన్షన్లను తీసేశారు’’ అంటూ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. ఈ ప్రాంతానికి కృష్ణ జలాలు వస్తున్నాయంటే వైఎస్సార్‌ పుణ్యమే. వైఎస్సార్‌, వైఎస్‌ జగన్‌ చేసిన మంచి ఈ ప్రాంత ప్రజలు, రైతులకు తెలుసు. బోగస్ మాటలు పక్కన పెట్టి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని ఆయన హితవు పలికారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)