Breaking News

ఇంత అరాచకమా..? చంద్రబాబు సర్కార్‌పై అవినాష్‌రెడ్డి ఫైర్‌

Published on Wed, 10/02/2024 - 12:40

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అరాచక పాలన సాగుతోందని.. వందరోజుల్లోనే చంద్రబాబు సర్కార్‌  అసంతప్తి మూటగట్టుకుందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిలెటిన్‌ స్టిక్స్‌ పేల్చి వీఆర్‌ఏ నరసింహను చంపారన్నారు. అక్రమ మైనింగ్‌ అడ్డుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాం. పులివెందులలో ఇష్టానుసారం మట్కా, జూదం నడిపిస్తున్నారు. జిల్లాలో లా అండ్‌ ఆర్డర్‌ గాడి తప్పింది’’ అని అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు.

పులివెందులతో పాటు జిల్లా వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో పులివెందుల ప్రశాంతంగా ఉండేంది. పులివెందులలో అభివృద్ధి, సంక్షేమం తప్ప ఇలాంటి సంస్కతి లేదు. వైఎస్‌ జగన్‌ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం వినియోగంలోకి తేవాలి’’ అని అవినాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

దేవుడిని అడ్డు పెట్టుకుని.

ఇదీ చదవండి: పౌర సేవలకు జగన్‌ సై.. మద్యం ఏరులకు బాబు సై సై!!

‘‘పులివెందులలో ఎంతో అద్భుతంగా నిర్మించిన మెడికల్ కాలేజీకి కూటమి ప్రభుత్వం అడ్మిషన్లు రాకుండా చేసింది. తిరుమల లడ్డు వివాదం పై సుప్రీంకోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన చంద్రబాబు బురదజల్లే విధంగా మాట్లాడటం దేశ వ్యాప్తంగా చూశారు. దేవుడిని అడ్డం పెట్టుకొని ఇలాంటి పనులు చేయొద్దు’’ అని అవినాష్‌రెడ్డి హితవు పలికారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)