Breaking News

‘చంద్రబాబు, రేవంత్‌ కలిసి రాయలసీమ గొంతు కోశారు’

Published on Wed, 01/07/2026 - 13:50

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌పై కడప డీఆర్సీ సమావేశంలో వైఎస్సార్‌సీపీ గళమెత్తింది. ఇంచార్జ్ మంత్రి సబితా అధ్యక్షతన జరిగిన డీఆర్సీ సమావేశంలో ఇరిగేషన్‌పై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఆ అంశంపై చర్చను కూటమి నేతలు పక్కదోవ పట్టించారు. అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. డీఆర్సీ సమావేశంలో అంతా ఆత్మ స్తుతి తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదని మండిపడ్డారు.

‘‘రాయలసీమ ఎత్తిపోతలపై చర్చిస్తే పక్కదోవ పట్టిస్తున్నారు. రేవంత్‌రెడ్డి, చంద్రబాబు ఇద్దరూ కలిసే రాయలసీమ గొంతు కోశారు. ఓ వైపు ఎటువంటి అనుమతులు లేకుండా తెలంగాణ సాగు, విద్యుత్ ఉత్పత్తికి ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతోంది. వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు రూ. 950 కోట్లు ఖర్చు చేశారు. వరద సమయంలో రోజుకు 3 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్ట్ ద్వారా తీసుకోవచ్చు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే ఈ ప్రాజెక్ట్ పర్యావరణ అనుమతులు రిజెక్ట్ చేశారు

..పొత్తులో ఉన్న బాబు ఆ అనుమతులు తీసుకురావడానికి కనీసం ప్రయత్నం చేయలేదు. పైగా దాన్ని రేవంత్, చంద్రబాబు కలిసి కుట్ర చేసి పక్కన పెట్టారు. సీమకు హక్కుగా రావాల్సిన 111 టీఎంసీల నీరు రావడం లేదు. అయినా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. పైగా ఈ ప్రాజెక్ట్ నిరర్థకమని ఇరిగేషన్ మంత్రి  మాట్లాడటం విడ్డూరంగా ఉంది. 800 అడుగుల్లో మనమూ నీళ్ళు తీసుకునే అవకాశం ఈ ఒక్క ప్రాజెక్ట్ వల్లే వస్తుంది. చంద్రబాబు వెంటనే పర్యావరణ అనుమతులు తీసుకురావాలి. రాయలసీమ ఎత్తిపోతల పనులు ముందుకు కొనసాగించాలి. ఈ ప్రాజెక్ట్ చేపట్టే వరకూ వైఎస్సార్సీపీ పోరాటం చేస్తూనే ఉంటుంది. రాయలసీమ రైతులపై ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగించాలి’’ అని అవినాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Avinash : ఇది డిస్ట్రిక్ట్ రివ్యూ కాదు.. టీడీపీకి డబ్బా కొట్టే మీటింగ్

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)