Breaking News

ఆనాడు అసలు వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

Published on Fri, 07/31/2026 - 13:38

భోగాపురం ఎయిర్ పోర్టును వైఎస్‌ జగన్‌ వ్యతిరేకించినట్లు పచ్చగుంపు అబద్దపు ప్రచారం చేస్తోంది. ఆయన ఏనాడూ ఎయిర్‌ పోర్ట్‌ను వ్యతిరేకించలేదు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలకు సొంత భాష్యాలు చెబుతూ.. ఎల్లో మీడియా చెలరేగిపోతోంది. అయితే, విమానాశ్రయానికి సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారనే అసలు వాస్తవానికి మాత్రం ముసుగేసింది.

ఆనాడు సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌ కేవలం శంకుస్థాపనకే పరిమితం కాలేదు. భూ సేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న న్యాయపరమైన వివాదాలన్నిటినీ పరిష్కరించారు. కావాల్సిన అనుమతులన్నీ తెప్పించారు. అన్నీ చేసిన తరవాత... 30 నెలల్లో పూర్తి చేయాలని జీఎంఆర్‌ సంస్థకు లక్ష్యం విధించి మరీ కొబ్బరికాయ కొట్టారు. కానీ ఎల్లో మీడియా మాత్రం  ఎయిర్ పోర్ట్‌ను వ్యతిరేకించారంటూ దుష్ప్రచారం చేస్తోంది.

ఆనాడు అసలేం జరిగిందంటే..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం చంద్రబాబు 2015లో రైతుల నుంచి 15,000 ఎకరాలను సేకరించాలని నిర్ణయం తీసుకోవడంపై స్థానిక రైతుల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. ఈ ఆందోళనతో వైఎస్‌ జగన్‌ కూడా ఏకీభవించారు. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు అన్ని ఎకరాల భూమి దేనికంటూ నిలదీశారు. 2,300 ఎకరాలు ఉంటే సరిపోతుందన్నారు. ‘‘చెన్నై ఎయిర్‌పోర్టు ఎన్ని ఎకరాల్లో ఉంది? ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఎన్ని ఎకరాల్లో ఉంది? అని ప్రశ్నిస్తూ వైఎస్‌ రైతులకు మద్దతుగా నిలిచారు.

చివరకు చంద్రబాబు ప్రభుత్వం సేకరించాల్సిన భూమిని తొలుత 6,000 ఎకరాలకు.. ఆ తర్వాత 2,700 ఎకరాలకు కుదించుకుంటూ వచ్చింది. చివరకు 2017లో 2,700 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించడంతో పాటు.. ఇందుకోసం ఏర్పాటు చేసిన భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌ కంపెనీ పేరుమీద రూ.1,500 కోట్ల అప్పును హడ్కో నుంచి తీసుకోవడానికి అనుమతిస్తూ జీవో ఇచ్చారు. అయితే బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఇవేమీ పట్టని  ఎల్లో గ్యాంగ్‌.. నాడు భూసేకరణను వ్యతిరేకించి.. ఎయిర్‌పోర్ట్‌ను అడ్డుకున్నారంటూ అసత్యాలు ప్రచారాలు చేస్తోంది.

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)