Breaking News

ఒక్క సీటు కూడా ఇవ్వను.. కాంగ్రెస్‌పై మమత ఫైర్

Published on Wed, 01/31/2024 - 16:55

కోల్‌కతా: ఇండియా కూటమిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. టీఎంసీతో పొత్తు కావాలంటే సీపీఎంతో తెగదెంపులు చేసుకోవాలని అన్నారు. సీట్ల పంపకాల్లో రెండు సీట్ల ప్రతిపాదనను కాంగ్రెస్ తీరస్కరించింది.. కానీ ఇప్పుడు ఒక్క సీటు కూడా ఇవ్వనని తెగేసి చెప్పారు.

'గతంలోనూ పలు సందర్భాల్లో సీపీఎం నాపై భౌతిక దాడి చేసింది. నన్ను నిర్దాక్షిణ్యంగా కొట్టారు. నా శ్రేయోభిలాషుల ఆశీస్సుల వల్లే బతికి ఉన్నాను. వామపక్షాలను ఎప్పటికీ క్షమించలేను. సీపీఎంను క్షమించలేను. కాబట్టి ఈరోజు సీపీఎంతో ఉన్నవాళ్లు బీజేపీతో కూడా ఉండొచ్చు. నేను వారిని క్షమించను.' అని మమతా బెనర్జీ మాల్డాలో ఏర్పాటు చేసిన సభలో అన్నారు.

'అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని కాంగ్రెస్‌కు చెప్పాను. రెండు పార్లమెంట్ స్థానాలు ఇస్తాం. మీ అభ్యర్థులను మేమే గెలిపించుకుంటాం అని చెప్పాం. కానీ వారికి ఎక్కువ సీట్లు కావాలి. నేను కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వను. మీరు వామపక్షాలను విడిచిపెట్టే వరకు మా వద్దకు రాకండి" అని మమతా బెనర్జీ అన్నారు.

తృణమూల్‌తో పొత్తు ఉండబోదని సీపీఎం గతంలోనే తేల్చి చెప్పింది. బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, సీపీఎం ఉంటాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి అన్నారు.  అటు.. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌధరి కూడా మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీఎంసీతో పొత్తు ఉండబోదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్, టీఎంసీ మధ్య పొత్తు కుదిరే పరిస్థితులు లేకుండా పోయాయి.

ఇదీ చదవండి: భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో రాహుల్‌ గాంధీ కారు అద్దాలు ధ్వంసం


 

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)