‘మన డప్పు కొట్టదు.. అందుకే రానివ్వొద్దు’

Published on Wed, 11/19/2025 - 16:47

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: పాలకుల ధోరణి పక్షపాతంగా మారితే ప్రజాస్వామ్య విలువలు తుడిచిపెట్టుకుపోతాయి. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యతను మరిచి, మీడియా స్వేచ్ఛను అడ్డుకుంటే అది ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా మారుతుంది. ఇదే పరిస్థితి ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోంది.

ఇటీవల పెండ్లిమర్రిలో నిర్వహించిన పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమానికి అన్ని మీడియా సంస్థలకు అనుమతి ఇచ్చినప్పటికీ, 'సాక్షి' మీడియా ప్రతినిధిని అనుమతించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే అనుమతి నిరాకరణ జరిగిందని అధికారులు పేర్కొనడం మరింత చర్చనీయాంశమైంది.

ఇది కేవలం ఒక మీడియా సంస్థను లక్ష్యంగా చేసుకున్న కుట్రగా భావిస్తున్నట్లు జర్నలిస్టు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే మంజూరు చేసిన పాస్ ఉన్నా, చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడం పక్షపాత ధోరణికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లోనూ, మీడియా వర్గాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. అధికారిక కార్యక్రమాల్లో మీడియాను అడ్డుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. 

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నా.. లేకున్నా.. మీడియా ప్రతినిధులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఉండేది. మీడియా ముఖంగా ప్రజలతో మాట్లాడే ధోరణి ఆయనలో కనిపించేది. ఇది పాలకుడిగా ఆయనలో ఉన్న ప్రజాస్వామ్య గుణాన్ని ప్రతిబింబిస్తుంది. అదే చంద్రబాబు పాలనలో మాత్రం మీడియా స్వేచ్ఛపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవాలతో ప్రశ్నించడం.. అనుకూల పత్రికల్లా బాకా ఊదకపోవడమే సాక్షికి అనుమతి నిరాకరించారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)