Breaking News

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక పెద్ద స్కాం: విడదల రజిని

Published on Sat, 09/06/2025 - 14:38

సాక్షి, తాడేపల్లి: వైఎస్‌ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు చంపేశారంటూ మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ఒక్కో మెడికల్ కాలేజీని తీసుకు రావటానికి ఎంత కష్టమో చంద్రబాబుకు తెలియదు.. ప్రతి జిల్లాలోనూ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి ఉంటే ప్రజలకు మంచి వైద్యం అందుతుందని వైఎస్‌ జగన్ ఊహించారు. వైద్యం, టెస్టులు అన్నీ ఫ్రీగా అందించాలన్నదే వైఎస్‌ జగన్ ఆలోచన. చంద్రబాబు మెడికల్  కాలేజీలను అమ్మకానికి పెడితే ఇక పేదోడి పరిస్థితి ఏంటి?’’ అంటూ విడుదల రజిని ప్రశ్నించారు.

శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు వైద్యవిద్యను దూరం చేశారని.. కోట్లు ఖర్చు చేసి ఆ కుటుంబాలు వైద్య విద్య చదవగలరా? అంటూ నిలదీశారు. మెడికల్ కాలేజీల కోసం సేకరించిన భూమిని కూడా ప్రైవేటుపరం అవుతోంది. దీని వెనుక పెద్ద స్కాం ఉంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. మేము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను తిరిగి ప్రభుత్వ పరం చేస్తాం. ఈ స్కాం వెనుక ఎవరున్నారో విచారణ చేస్తాం’’ అని విడదల రజిని పేర్కొన్నారు.

‘‘ఆరోగ్యశ్రీని దివంగత మహానేత వైఎస్సార్‌ తీసుకు వచ్చారు. కొన్ని లక్షలమందికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించారు. అలాంటి సంజీవిని లాంటి ఆరోగ్యశ్రీని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. నెట్ వర్క్ ఆస్పత్రులకు రూ.4 వేల కోట్లకు పైగా బకాయిలు పడ్డారు. ప్రజల ప్రాణాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారు. ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల చేతిలో పెట్టడం వెనుక స్కాం ఉంది. వైఎస్సార్, జగన్ పేరును ప్రజల్లో లేకుండా చేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలను 120 సంవత్సరాలు బతికిస్తానని చంద్రబాబు డబ్బా కొడుతున్నారు. ముందుగా తురకపాలెంలో జరుగుతున్న మరణాలను ఆపండి. మాటలు ఆపి ప్రజల ప్రాణాలను కాపాడాలి’’ అంటూ విడదల రజిని డిమాండ్‌ చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)