Breaking News

విలన్లు సినిమాల్లో ఉండరు.. చంద్రబాబు రూపంలో ఇక్కడే ఉంటారు: వైఎస్‌ జగన్‌

Published on Wed, 07/01/2026 - 12:12

సాక్షి, తాడేపల్లి: ‘‘ఎక్కడా నైతిక విలువల్లేవ్‌.. మానవత్వం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. జంగిల్‌రాజ్‌ అంటే ఎక్కడో బిహార్‌లో లేదు.. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లోనే చంద్రబాబు పాలన రూపంలో కనిపిస్తోంది’’ అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. గత 18 నెలలుగా వరుసగా కొనసాగుతున్న అరాచకాలే అందుకు నిదర్శనమని అన్నారాయన. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బాబు జంగిల్‌రాజ్‌పై ధ్వజమెత్తారు. 

బాబు పాలనలో బాధితులే నిందితులు. ఆశ్చర్యం అనిపించినా.. అదే నిజం. ఇటీవల రాజధాని రైతులు నన్ను కలిశారు. తమ గోడును వెల్లబోసుకున్నారు. వారి కోరిక మేరకు మా పార్టీ తరఫున ఓ ప్రత్యేక కమిటీతోపాటు లీగల్‌ టీంను ఏర్పాటు చేశాం. రైతుల ఆహ్వానం మేరకు వాళ్లు అక్కడ పర్యటించబోయారు. అయితే.. టీడీపీ గూండాలు వాళ్లను అడ్డుకుని దాడులు చేశారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇతర వైఎస్సార్‌సీపీ నాయకులపై హత్యాయత్నానికి పాల్పడటంతో పాటు భౌతిక దాడులు చేశారు. దాడిలో ఓ కానిస్టేబుల్‌కు సైతం గాయాలయ్యాయి. 

టీడీపీ గూండాలే ఆ దాడి చేసినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి.(లోకేష్‌తో దాడికి పాల్పడ్డ టీడీపీ నేతలు దిగిన ఫొటోలను వైఎస్‌ జగన్‌ ప్రదర్శించారు..) ఆశ్చర్యకరంగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, బాధితులైన వైఎస్సార్‌సీపీ నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. 

ఈ అల్లర్లలో ఒక్క టీడీపీ నేతను అరెస్ట్‌ చేయలేదని.. చంద్రబాబు పాలన తీరుకు నిదర్శనమని జగన్‌ అన్నారు. బాధితులకే నిందలు మోపడం, వారిపైనే కేసులు పెట్టడం ఇప్పుడు సాధారణంగా మారిపోయిందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితులు ప్రమాదకరమని, రాష్ట్రంలో న్యాయవ్యవస్థ, శాంతిభద్రతల పరిస్థితిపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

భూమి ఇవ్వని రైతులను భూసేకరణపేరుతో వేధిస్తున్నారు. కొడవీటి వాగును బలవంతంగా రైతుల పొలాల్లోకి తరలించారు.  రాజధాని ప్రాంత రైతులు అడుగుతున్న దాంట్లో తప్పేముంది? ఇంకా భూముల అవసరం ఏముంది?. భూములు లాక్కుని ఎందుకు వెళ్లగొడుతున్నారని రైతులు అడుగుతున్నారు?. రైతులు పడే అవస్థలు బయటకు రావొద్దనే చంద్రబాబు ఈ డ్రామాలు ఆడుతున్నారు. రైతులకే కాదు.. ఆయన పాలనలో ఎవరికీ రక్షణ లేదు. పశ్నిస్తే రౌడీ షీటర్లు అని ముద్ర వేస్తున్నారు. ఎన్టీఆర్‌ బతికే ఉంటే.. ఆయనకు ప్రశ్నించే సమయం ఉండి ఉంటే.. ఆయన్ని కూడా చంద్రబాబు రౌడీ షీటర్‌ అనేవారేమో. విలన్లు సినిమాల్లో ఉండరు.. చంద్రబాబు రూపంలో ఇక్కడే ఉంటారు. వైఎస్‌ జగన్‌ అన్నారు.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)