చంద్రబాబు క్షమాపణ చెప్పాలి

Published on Tue, 10/01/2024 - 03:41

సాక్షి, అమరావతి: తిరుమల ప్రసాదం పవి­త్రతను దెబ్బతీసేలా అసత్య ఆరో­ప­ణలు చేసిన ముఖ్యమంత్రి చంద్ర­బాబు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ వేంకటే­శ్వర స్వామి భక్తులకు క్షమా­పణ చెప్పాలని వైఎస్సార్‌­సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీని­వాసరావు డిమాండ్‌ చేశారు. వేంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పిన రోజు నుంచి కోట్లాది భక్తులు ఆవేదనతో ఉన్నారని తెలిపారు. ఆయన సోమవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాల­యంలో మీడియాతో మాట్లా­డుతూ.. రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న సీఎం స్థాయి వ్యక్తి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పు పట్టిందన్నారు.

సుప్రీం కోర్టు­లో ప్రభుత్వం తరపున వాదించిన న్యాయ­వాది కూడా కల్తీ జరి­గిందని చెబుతున్న నెయ్యిని వాడలే­దని చెప్పారన్నారు. కల్తీ అయిందని చెబు­తున్న నెయ్యి వాడలేదు కదా అని సుప్రీం కోర్టు ప్రశ్నించడంతో పాటు, దానిపై సెకెండ్‌ ఒపీనియన్‌ ఎందుకు తీసుకోలేదని కూడా నిలదీసిందని చెప్పారు.  జూలై 23 నుంచి సెప్టెంబరు 18 వరకు ఈ విష­యాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారని కూడా సర్వోన్నత న్యాయ­స్ధానం చంద్రబాబు ప్రభు­త్వాన్ని నిలదీ­సిందని తెలిపారు. సిట్‌ నియామ­కాన్ని కూడా ప్రశ్నించిందన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో వాస్తవాలు త్వరలోనే బయటపడతా­యని అన్నారు. ఈ మొత్తం వ్యవహా­రంపై సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రాజకీయాల్లోకి దేవుడిని లాగొద్దని వెల్లంపల్లి మరోసారి చంద్రబాబుకి సూచించారు.

Videos

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)