Breaking News

‘తిరుమలలో భక్తుల భద్రతను గాలికొదిలేశారు’

Published on Fri, 12/26/2025 - 16:32

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీపై కూటమి సర్కార్‌ బురద జల్లడమే పనిపెట్టుకుందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఉందా? అంటూ ప్రశ్నించారు. కూటమి పాలనలో తిరుమలలో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరుపతిలో మళ్లీ తొక్కిసలాట టీటీడీ బోర్డు, ప్రభుత్వం నిర్లక్ష్యమే. భక్తుల భద్రతను గాలికి వదిలేశారు. వరస సెలవులతో భక్తులు ఎక్కువగా  వస్తారనే ఇంగితజ్ఞానం లేదా?. ఎన్ని ఘటనలు జరిగినా, ఎన్ని ప్రాణాలు పోయినా.. జాగ్రత్తలు తీసుకోరా..?. తిరుమల రావాలంటేనే భక్తులు  భయపడేలా వ్యవహరిస్తున్నారు. తిరుమలలో పాలన చేస్తోంది టీటీడీ బోర్డు కాదు.. టీడీపీ పార్టీ. పొలిటికల్ డైవర్షన్స్ కోసం టీటీడీని వాడుకోవటం సిగ్గుచేటు’’ అంటూ వెల్లంపల్లి ధ్వజమెత్తారు.

‘‘దయచేసి వెంకటేశ్వర స్వామికి రాజకీయాలు ముడిపెట్టకండి. సనాతన ధర్మం మాట్లాడే పవన్ వీటి గురించి పట్టించుకోరా?. ఇంకెన్నాళ్లు  గత ప్రభుత్వం అంటూ బురదజల్లుతారు?. భక్తుల రద్దీ దృష్ట్యా చర్యలు తీసుకోలేని బోర్డు ఉండీ ఏం ఉపయోగం..?. భక్తులకు రక్షణ ఇవ్వలేని బోర్డు అవసరమా..?. మీకు చేతకాకపోతే తప్పుకోండి’’ అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్‌ నిప్పులు చెరిగారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)