Breaking News

పవన్‌ కల్యాణ్‌కు ఓపెన్‌ ఛాలెంజ్‌: వాసిరెడ్డి పద్మ

Published on Thu, 07/27/2023 - 17:25

సాక్షి, గుంటూరు: మహిళలను గౌరవించే చరిత్ర చంద్రబాబు, పవన్‌కు లేదని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బాబు, పవన్‌ భాగస్వామ్య ప్రభుత్వంలో మహిళలపై అనేక దాడులు జరిగాయని గుర్తు చేశారు. ‘‘పవన్‌ కల్యాణ్‌కు ఓపెన్‌ ఛాలెంజ్‌. మహిళల సమక్షంలో రచ్చబండకు సిద్ధమా?. చంద్రబాబు మహిళలకు చేసిన ఒక్క మేలైనా చెప్పాలి’’ అంటూ వాసిరెడ్డి పద్మ నిలదీశారు.

‘‘మహిళా పోలీసులను పెట్టాలనే ఆలోచన బాబుకు ఎందుకు రాలేదు?. మహిళా కమిషన్‌ను భ్రష్టు పట్టించాలనే మీ ఆటలు సాగవు. మహిళా కమిషన్‌పై చిందులు వేయడం పవన్‌, చంద్రబాబు మానుకోవాలి. మహిళల అదృశ్యంపై పవన్‌ నొటికొచ్చినట్లు మాట్లాడారు. బాబు హయాంలో మహిళలకు సమాన వాటా ఎప్పుడైనా ఇచ్చారా?. పవన్‌ది రాజకీయ కోపమా? రాష్ట్ర ప్రభుత్వంపై కోపమా?. మిసైన మహిళల్లో 78 శాతం మంది తిరిగి వచ్చారని డీజీపీ వెల్లడించారు. ఎక్కడా జరగనిది ఏపీలోనే జరుగుతోందని పవన్‌ ప్రచారం చేస్తున్నారు. తప్పు చేసిన వారిని మహిళా కమిషన్‌ ప్రశ్నిస్తుంది’’ అని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.
చదవండి: బాబు బాటలో పవన్‌.. నమ్మినవారినే నట్టేట ముంచేశాడా?

‘‘రాజ్యసభలో కేంద్రమంత్రి ప్రకటన చేశారంటూ పవన్  హడావిడి చేస్తున్నారు. టాప్ టెన్‌లో ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో లెక్కలు ఎందుకు అడగడం లేదు. ఏపిలోని మహిళల మిస్సింగ్ గురించి పవన్ ఎందుకు తాపత్రయపడుతున్నారు. రాష్ట్రంపై ఎందుకు విషం చిమ్ముతున్నారు. మిస్సింగ్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌ 11వ స్థానంలో ఉంది. ఏపీపై మాత్రమే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడుతున్నారు?. మొదటి పది రాష్ట్రాల గురించి ఒక్క మాట కూడా ఎందుకు ప్రస్తావించడం లేదు’’  అంటూ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)