Breaking News

‘కూటమి’ పాలనలో మహిళలకు రక్షణ ఏదీ?: వరుదు కల్యాణి

Published on Sat, 11/02/2024 - 16:54

సాక్షి, విశాఖపట్నం: కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని  వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం సొంత జిల్లాలోనే మహిళలకు భద్రత కరువైందన్నారు. బాధిత కుటుంబాలను కూటమి నేతలు ఇప్పటివరకు పరామర్శించలేదన్నారు. వైఎస్సార్‌సీపీ స్పందిస్తేనే కూటమి నేతలు బాధిత కుటుంబాల వద్దకు వెళ్తున్నారన్నారు.

‘‘రాష్ట్రంలో మహిళల మాన, ప్రాణాలకు రక్షణ లేదని రోజూ రుజువవుతుంది. రాష్ట్రంలో 120కి పైగా ఘటనలు మహిళలపై జరిగాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటే మహిళలపై జరుగుతున్న ఘటనలపై ఎందుకు స్పందించడం లేదు?. చంద్రబాబు జిల్లాలోనే మహిళలపై, బాలికలపై దాడులు జరుగుతున్నాయి. తిరుపతిలో మరో బాలికపై అత్యాచారం చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లల తల్లితండ్రులు భయపడుతున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇన్ని ఘటనలు జరుగుతుంటే ఆయన ఎందుకు స్పందించడం లేదు?’’ అంటూ వరుదు కల్యాణి ప్రశ్నలు గుప్పించారు.

మద్యం, ఇసుక మీద పెట్టిన చర్చ మహిళల భద్రతపై ఎందుకు పెట్టరు..?. వైసీపీ నేతలు బాధితుల పరామర్శకు వెళ్తే.. ప్రభుత్వం స్పందిస్తుంది. గంజాయి నిర్మూలిస్తామని చెప్పే హోం మంత్రి ఏమి మాట్లాడటం లేదు. ఇన్ని ఘటనలు జరుగుతుంటే.. హోం మంత్రి ఏమి చేస్తున్నట్టు.. ఏమైనా అంటే నేను లాటీ పట్టుకొని తిరగాలా అని హోం మంత్రి అడుగుతారు. చేతగాని ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి చేతకాని పరిపాలన చేస్తున్నారు. ఆడపిల్లలు ఎక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నారు.. హోం మంత్రి సమాధానం చెప్పాలి. ప్రతిపక్ష నాయకుడికి ఉన్న మానవత్వం ఈ ప్రభుత్వానికి లేదు’’ అని వరుదు కల్యాణి దుయ్యబట్టారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)