Breaking News

‘కేంద్ర ప్రభుత్వ ఇమేజ్‌ పెంచే ప్రయత్నం చేయాలి’

Published on Fri, 10/03/2025 - 17:15

హైదరాబాద్‌:  కేంద్ర ప్రభుత్వ ఇమేజ్‌ పెంచే ప్రయత్నం చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. నగరంలో ఈరోజు(శుక్రవారం, అక్డోబర్‌ 3వ తేదీ) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లీగల్‌ సెల్‌ సమావేశమైంది. ఈ కార్యక్రమానికి  కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవల్‌ ముఖ్య అతిథిగా హాజరు కాగా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు కె. లక్ష్మణ్‌, రఘునందన్‌రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావులు పాల్గొన్నారు. 

దీనిలో భాగంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ కేంద్ర ప్రభుత్వం ఇమేజ్‌ను పెంచేందుకు పార్టీలోని ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి. కేంద్ర పాలసీలకు అనుగుణంగా కోర్టలల  మనం వాదిస్తామనేది కీలకం రానున్న మూడేళ్లు కీలకం. అందుకు ప్రత్యేకమైన శిక్షణ తరగతులు నిర్వహించాలి.కేంద్ర ప్రభుత్వ స్టాండ్ బలంగా వినిపించేందుకు ఎఫర్ట్ పెట్టాలి. తెలంగాణ లో అధికారంలో బీజేపీ రావాలి అంటే అందరం కలసి కట్టుగా పని చేయాలి. అర్జున్ రామ్ మేఘవల్ ఐఏఎస్‌గా ఉన్నప్పటికీ రాజీనామా చేసి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. ప్రతి శాఖ అనేక రిఫార్మ్స్ తీసుకువస్తుంది. కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలి.బ్రిటిష్ చట్టాలు ఇప్పటికి అమలు అవుతున్నాయి. వర్తమాన ప్రజల ఆలోచనలకు అనుగుణంగా చట్టాలు తేవాలని మోదీ ఆలోచన’ అని పేర్కొన్నారు.

ఎంపీ లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ‘ కాలం చెల్లిన చట్టాలను మోదీ రద్దు చేశారు దేశాన్ని ఆర్థికంగా విచ్ఛిన్నం చేసేందుకు ఇతర దేశాలు కుట్రలు పన్నుతున్నాయి. మోదీ విజనరీ లీడర్ కాబట్టి సూక్ష్మంగా స్పందిస్తున్నారు. జీఎస్టీ తగ్గిపుతో దీపావళి వెలుగులు పేదల ఇళ్లల్లో నింపుతున్నారు. అగ్రదేశాల అడ్డగోలు టారిఫ్‌లతో తో భారతదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని చూస్తున్నాయి.ఇండియా ఎదుగుదలను చాలా దేశాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. స్వదేశీ వస్తువుల వినియోగించడం ద్వారా.. మన ఆదాయం ఇతర దేశాలకు వెళ్లకుండా ఉంటుంది. పెట్టుబడులు పెరుగుతాయి. ఇతరులకు ఉపాధి కలుగుతుంది’ అని స్పష్టం చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ. ‘ త్వరిగతిన న్యాయం దక్కాలని గత చట్టాలను రద్దు చేసి.. భారత న్యాయ సంహిత చట్టాలు మోదీ సర్కార్ తెచ్చింది. హైదరాబాద్ నడి రోడ్డుపై న్యాయవాది దంపతులను నరికి చంపారు. కేసు వేసిన వాళ్లను వెనక్కి తీసుకోకపోతే హత్య చేశారు. సీబీఐ దర్యాప్తు ప్రస్తుతం జరుగుతుంది. న్యాయవాదులకు భద్రత కల్పించే చట్టాలు రావాలి’ అని పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: 
త్వరలో ఆపరేషన్‌ సిందూర్‌ 2.0
 

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)