Breaking News

‘కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ విలీనం తథ్యం

Published on Sat, 08/17/2024 - 05:16

సాక్షి, న్యూఢిల్లీ: అతి త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో బీఆర్‌ఎస్‌ విలీనం కావడం తథ్యమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ తెలిపారు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనమవు తుందని, అందులో భాగంగానే కవితకు బెయిల్‌ రాబోతుందంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని బండి సంజయ్‌ పేర్కొన్నారు. కవితకు బెయిల్‌ ఇవ్వాలా? వద్దా? అనేది న్యాయస్థానం పరిధిలోని అంశమని, కవిత బెయిల్‌కు, బీజేపీకి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. ఆమ్‌ఆద్మీ పార్టీని విలీనం చేసుకుంటేనే ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు బెయిల్‌ వచ్చిందా అని నిలదీశారు.

సీఎం పదవిలో కొనసా గుతూ రాజకీయలబ్ధి కోసం రేవంత్‌రెడ్డి  న్యాయస్థానంపై బురదచల్లి కోర్టుల ప్రతిష్టను తగ్గించడం దుర్మార్గమన్నారు. బీజేపీని బదనాం చేసేందుకు కాంగ్రెస్‌ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కేంద్రమంత్రి బండి సంజయ్‌ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ది ముగిసిన అధ్యాయమని, ప్రజలు ఛీత్కరించిన ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. పథకం ప్రకారమే ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని, అతి త్వరలోనే కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ విలీనమవడం తథ్యమన్నారు. 

కేసీఆర్‌ను ఏఐసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, కేటీఆర్‌ను పీసీసీ చీఫ్‌గా, హరీశ్‌రావుకు మంత్రిపదవి ఇవ్వడంతోపాటు, కవితకు రాజ్యసభ పదవి ఇవ్వడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ నాయకులకు అంత ఉబలాటముంటే రాజ్యసభ ఎన్నికలొస్తున్నందున కవితను కాంగ్రెస్‌ పక్షాన రాజ్యసభకు పంపినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎద్దేవా చేశారు. గతంలోనూ బీఆర్‌ఎస్‌తో  మంత్రి పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. అందుకే కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్‌ట్యాపింగ్‌ సహా అనేక అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడ్డ కేసీఆర్, కేటీఆర్‌ సహా బీఆర్‌ఎస్‌ నేతలు జైలుకు వెళ్లకుండా కాంగ్రెస్‌ పార్టీనే కాపాడుతోందని సంజయ్‌ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ దాగుడు మూతల వ్యవహారం జగమెరిగిన సత్యమని ‘నువ్వు కొట్టినట్లు చెయ్‌... నేను ఏడ్చినట్లు చేస్తానన్నట్లుంది’ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నేతల తీరు అని విమర్శించారు.

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)