Breaking News

విమోచన దినంపై కాంగ్రెస్‌ వైఖరేంటి?: బండి సంజయ్‌

Published on Mon, 09/16/2024 - 01:05

రసూల్‌పురా: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకముందు జై తెలంగాణ అని నినదించి ఇపుడు ఎందుకని విమోచన దినోత్సవం జరపడం లేదో సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. నిజాం నవాబు, రజాకార్ల అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన అమరవీరుల విశేషాలను తెలియజేసే ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆదివారం సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో బండి సంజయ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకు కేంద్ర సాంస్కృతిక, హోంశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తు న్నామని తెలిపారు.

ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రతీ ఒక్కరు చూడాలని భావిత రాలకు నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల ఆకృత్యాల వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు, అవమానాలు పడ్డారో, ఏయే ప్రాంతాల్లో ఉద్యమాలు జరిగాయో ఫొటో ఎగ్జిబిషన్‌ తెలియజేస్తుందని చెప్పారు. గతంలో ఉన్న రజాకార్ల దళం నేడు ఎంఐఎం పార్టీగా మారిందని అలాంటి దళాన్ని నాటి బీఆర్‌ఎస్, నేటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పొగుడుతున్నారని విమర్శించారు.

బీఆర్‌ఎస్‌ సమైక్యదినం అంటే కాంగ్రెస్‌ వాళ్లు ప్రజాపాలన అంటున్నారని ప్రజావంచన దినోత్సవం అని పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. పాఠ్యాంశాల్లో తెలంగాణచరిత్ర చేర్చాలన్న ఆలోచన త్వరలో ఫలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌. చింతల రామచంద్రారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పీఎల్‌.శ్రీనివాస్‌ నగర నాయకులు పాల్గొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)