Breaking News

పవన్‌ కల్యాణ్‌ ‘దిష్టి’ వ్యాఖ్యలపై స్పందించిన ఉండవల్లి

Published on Sat, 12/06/2025 - 18:16

సాక్షి, తూర్పుగోదావరి: పవన్‌ కల్యాణ్‌ ‘దిష్టి’ వ్యాఖ్యలపై ఉండవల్లి అరుణ్‌కుమార్‌ స్పందించారు. కోనసీమకు తెలంగాణ ‘దిష్టి’ తగిలిందన్న వ్యాఖ్యలు సరికాదన్నారు. శనివారం ఆయన రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భారీగా పెట్టుబడులు తెస్తానంటున్న చంద్రబాబు తన వ్యాపారాలను ఏపీలో ఎందుకు పెట్టడం లేదంటూ ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి నేను వ్యతిరేకం కాదు.. అన్ని వేల ఎకరాలు ఎందుకనేదే నా ప్రశ్న’’ అంటూ ఉండవల్లి వ్యాఖ్యానించారు.

కాగా, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. గోదావరి జిల్లాలో కనిపించే పచ్చదనంపై తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారని.. నరుడి దిష్టికి రాయి కూడా పగిలిపోతుందని అంటారు అని పవన్‌ చేసిన కామెంట్లపై తెలంగాణ నాయకులు భగ్గుమన్న సంగతి తెలిసిందే. పవన్‌ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ.. పవన్‌ క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్‌ కూడా ఇచ్చారు.

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు తనను బాధించాయని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పవన్ క్షమాపణ చెప్పక పోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వం. మంత్రిగా చెబుతున్నా.. ఒక్క థియేటర్లో కూడా పవన్‌ సినిమా విడుదల కాదు. పవన్‌ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. రాజకీయ అనుభవం లేకనే ఇలా మాట్లాడుతున్నాడంటూ కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)