Breaking News

సుప్రీంకోర్టు నోటీసులు.. యూటర్న్‌ తీసుకున్న తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలు

Published on Thu, 09/11/2025 - 19:49

సాక్షి,హైదరాబాద్‌: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలు యూ టర్న్‌ తీసుకున్నారు. తాము కాంగ్రెస్‌లో చేరలేదని బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని స్పష్టం చేశారు.

బీఆర్​ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని గత నెల 31న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇదే అంశంపై తెలంగాణ  స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ స్పీకర్‌ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. వారి వద్ద నుంచి వివరణ తీసుకున్నారు. స్పీకర్‌ పంపిన నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు కౌంటర్‌ దాఖలు చేశారు.

  • కాంగ్రెస్‌లో చేరలేదు.. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌ను కలిశా.బీఆర్‌ఎస్‌కు నేను రాజీనామా చేయలేదు-పోచారం శ్రీనివాస్ రెడ్డి

  • మా ఫోటోలను మార్ఫ్ చేశారు. నేను ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా.నాది బీఆర్‌ఎస్‌ ఐడియాలజీ- బండ్ల  కృష్ణ మోహన్ రెడ్డి

  • నేను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా.కాంగ్రెస్‌లో చేరానన్నది అబద్ధం- కాలే యాదయ్య

  • నేను బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నా. కాంగ్రెస్‌లో చేరలేదు. ఇప్పటికి బీఆర్‌ఎస్‌కే నా మద్దతు-  గూడెం మహిపాల్‌

  • ఇప్పటికి బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశా- అరికెపూడి గాంధీ వివరణిచ్చారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)