Breaking News

నవంబర్ 2 లోగా సంక్షేమ పథకాల చెల్లింపులు విడుదల చేయాలి: రేవంత్‌రెడ్డి

Published on Thu, 10/26/2023 - 11:42

సాక్షి, న్యూఢిల్లీ: నోటిఫికేషన్‌ విడుదలకు ముందే నగదు బదిలీ కార్యక్రమాలు పూర్తిచేయాలని ఈసీని కోరామని టీపీసీసీ ఛీప్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. 

‘‘బీఆర్‌ఎస్‌కు అనుకూలమైన రిటైర్డ్‌ అధికారులను తొలగించాలని కోరాం. బీఆర్‌ఎస్‌కు అనుకూలమైన అధికారులు ఏళ్లుగా కీలకమైన రంగాల్లో ఉన్నారు. కీలకమైన రంగాల్లో ఉన్న అధికారులు.. బీఆర్‌ఎస్‌కు ఆర్థిక సాయం చేయాలని వ్యాపార రంగాల వారిని కోరుతున్నారు. డీజీపీ అంజనీకుమార్‌ని తొలగించాలని ఈసీని కోరామని రేవంత్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం కలిసి పనిచేస్తాయి. బీఆర్‌ఎస్‌,బీజేపీ,ఎంఐఎం.. చడ్డీ గ్యాంగ్‌. బీఆర్‌ఎస్‌ను కాపాడేందుకు కేంద్రం పనిచేస్తుందని రేవంత్‌ ధ్వజమెత్తారు.

బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా అధికారులు: ఉత్తమ్‌
బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకలాపాలకు ప్రభుత్వ భవనాలు వాడుతున్నారని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. తొమ్మిదిన్నరేళ్లుగా కొంతమంది అధికారులు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. సీఎం అధికార నివాసాన్ని పార్టీ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని తెలిపారు.

బీఆర్‌ఎస్‌ ప్రజలను తప్పుదారి పట్టిస్తుంది: భట్టి
బీఆర్‌ఎస్‌ ప్రజలను ఎలా తప్పుదారి పట్టిస్తుందో ఈసీకి తెలిపామని భట్టి విక్రమార్క అన్నారు. మేం చెప్పింది ఒకటైతే బీఆర్‌ఎస్‌ గోబెల్స్‌ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

‘‘మళ్లీ కేసీఆర్ మాయలో పడేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. నాణ్యతాలోపం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయి. కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోంది. క్రిమినల్ కేసులు పెట్టి విచారిస్తే తప్ప అసలు విషయం బయటకు రాదు. డ్యామ్ సేఫ్టీ అధికారులు నివేదికను నివేదికను బయటపెట్టడం లేదు. కేంద్రానికి.. బీఆర్ఎస్ కు ఉన్న లాలూచీ ఏంటి?. కేంద్రానికి ప్రొటెక్షన్ మనీ చెల్లించారు కాబట్టే రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలపై చర్యలు తీసుకోవడంలేదు. మేడిగడ్డ కాదు.. కేసీఆర్ ప్రభుత్వం కుంగిపోయే పరిస్థితి వచ్చింది’’ అంటూ టీ.కాంగ్రెస్‌ నేతలు నిప్పులు చెరిగారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)