Breaking News

ఎర్రబెల్లి ఓనమాలు రాస్తే నేను తప్పుకుంటా

Published on Thu, 02/16/2023 - 03:20

పాలకుర్తి/పాలకుర్తిటౌన్‌/ దేవరుప్పుల/జనగామ: పాలకుర్తి చౌరస్తాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓనమాలు, ఏబీసీడీలు రాస్తే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని టీపీసీసీ చీఫ్‌ అనుముల రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. పౌరుషం గల ఈ గడ్డ మీద పలక బలపం ఇస్తే ఓనమాలు రాయనోడు ఎమ్మెల్యే అయ్యిండంటే విచారకరమని వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయం నుంచి రేవంత్‌రెడ్డి జనగామ జిల్లా దేవరుప్పుల నుంచి పాలకుర్తి వరకు హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర సాగించారు.

యాత్రలో మిర్చి, పత్తి రైతులను పలకరించారు. రాత్రి పాలకుర్తి చౌరస్తాలో జిల్లా పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. డాక్టర్‌ సుధాకర్‌రావు ఉన్నప్పుడే బావ.. బావ అని తిరుగుతుంటే వెన్నుపోటు పొడుస్తడని చెప్పినా నమ్మలేదని, దీంతో డాక్టర్‌ సాబ్‌ కనుమరుగయ్యాడని విచారం వ్యక్తం చేశారు. ఎర్రబెల్లికి చదువురాకున్నా చంద్రబాబు విప్‌గా ఇస్తే విస్మరించి కేసీఆర్‌ రాచరికపు పాలన కోసం పావుగా పనిచేసి ఈ రోజు మంత్రి అయ్యాడని, తెలుగుదేశాన్ని నట్టేట ముంచిన దుర్మార్గుడని దుయ్యబట్టారు.

మేడారం అడవుల్లో కేసీఆర్, ఎర్రబెల్లిలకు పులి ఎదురైతే ఎర్రబెల్లి బూట్లు చదురుకుంటున్నట్లు నమ్మబలికి కేసీఆర్‌ను ఆ పులికి ఎరగా వేస్తాడని చమత్కరించారు. నాడు టీడీపీ తరహాలో నేడు బీఆర్‌ఎస్‌ను దయాకర్‌రావు బొందపెడతాడని, జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్‌కు హితవు పలికారు. చెన్నూరు రిజర్వాయర్‌ టెండర్‌ డబుల్‌ చేసి కమీషన్‌లు నొక్కాడని, ధరణితో బీఆర్‌ఎస్‌ నాయకులు భూ దందా చేసి మంత్రికి బినామీ ఆస్తులను కూడబెట్టుతున్నారని ఆరోపించారు. 

కేసీఆర్‌ దుష్టపాలనకు చరమగీతం పాడండి 
సబ్బండ వర్గాలు సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని రాచరిపుక విధానాలతో ఏలుతున్న కేసీఆర్‌ దుష్టపాలనకు చైతన్యవంతులైన తెలంగాణ సమాజం చరమగీతం పాడాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. 2024లో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే ధరణి ద్వారా దోపిడీ చేసిన భూదందాదారులను జైలుపాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు మల్లు రవి, పొన్నం ప్రభాకర్, దొమ్మాటి సాంబయ్య, సిరిసిల్ల రాజయ్య, బల్మూరి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.  

పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడితే సహించబోం 
హంగ్‌ పాలనపై ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌ స్పందించారు. ఈ విషయమై అధిష్టానం అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు.  ధర్మాపురం శివారులో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌కు పొత్తు ఉంటుందని పార్టీలోని సీనియర్‌ నాయకులు మాట్లాడినా చర్యలు తప్పవని, ఈ విషయాన్ని రాహుల్‌గాంధీ స్వయంగా చెప్పినట్లు తెలిపారు. రాష్ట్రంలో అధికార ప్రభుత్వంపై విసుగు చెందిన ప్రజలు.. కాంగ్రెస్‌ పాలన వైపు ఎదురు చూస్తున్న సమయంలో పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడితే ఎంతటి వారైనా సంహించేది లేదని హెచ్చరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)