Breaking News

మీ మేనిఫెస్టోల్లో పెట్టలేదా?

Published on Tue, 10/01/2024 - 05:52

సాక్షి, హైదరాబాద్‌: మూసీ ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటుంటే బీఆర్‌ఎస్, బీజేపీ రాద్ధాంతం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌ కుమార్‌గౌడ్‌ మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనను ఆ పార్టీలు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టలేదా అని నిలదీశారు. మూసీపై ఒక్క గుడిసె కూడా ప్రభుత్వం తొలగించలేదని, అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అందరూ గ్లోబల్‌ వారి్మంగ్‌ గురించి మాట్లాడుతుంటే బీఆర్‌ఎస్‌ నేతల మెదళ్లకు మాత్రం ఆ ఆలోచన రావడం లేదని వ్యాఖ్యానించారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నివేదిక ప్రకారం దేశంలో అత్యంత కలుíÙతమైన నదిగా మూసీ గుర్తింపు పొందిందని, ఇలాంటి పరిస్థితుల్లో మూసీని ప్రక్షాళన చేయడం వల్ల రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్‌ జిల్లాలకు చెందిన 26 లక్షల మందికి మేలు జరుగుతుందన్నారు. 

వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు 
సోషల్‌మీడియాను ఉపయోగించి ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారని మహేశ్‌కుమార్‌ విమర్శించారు. సోషల్‌మీడియా కోసం బీఆర్‌ఎస్‌ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందని ఆరోపించారు. సోషల్‌ మీడియాలో దు్రష్పచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్‌క్రైమ్‌ అధికారులను కోరామన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధి అంటే ప్రగతి భవన్, జన్వాడ ఫామ్‌హౌజ్‌ల చుట్టూ కాదని, చార్మినార్, మూసీలో జరగాలని అన్నారు.

గత పదేళ్లలో 1,500 చెరువులు కబ్జాకు గురయ్యాయని ఇందులో 80 శాతం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కలిసి బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు చేసినవేనని ఆరోపించారు. హైదరాబాద్‌ను బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు కబళించారని, ఈ భూబకాసురులే తమ టార్గెట్‌ అని, పేద ప్రజలు కాదని స్పష్టంచేశారు. సమయం వచి్చనప్పుడు ఈ భూబకాసురుల పేర్లు బయటకు వస్తాయని, వారు వెళ్లే జైలు పేరు కూడా తెలుస్తుందని మహేశ్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు. హైడ్రాతో భయభ్రాంతులకు గురవుతున్నది బీఆర్‌ఎస్‌ నేతలే తప్ప సామాన్య ప్రజలు కాదని అన్నారు.   

తలో దిక్కు దోచుకున్నారు 
రాష్ట్రాన్ని పదేళ్ల పాలించిన బీఆర్‌ఎస్‌ మల్లన్నసాగర్‌ కట్టేందుకు సీఆరీ్పఎఫ్‌ జవాన్లతో కొట్టించి మరీ ప్రజలను ఖాళీ చేయించిందని మహేశ్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల అరాచకాలను ప్రజలు మర్చిపోలేదని, తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు తలోదిక్కు దోచుకున్న విషయాన్ని గమనించిన తర్వాతే పార్లమెంటు ఎన్నికల్లోనూ ఆ పార్టీకి సున్నా సీట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇక, బీజేపీ నేతల్లో ప్రజానాయకులు ఎవరున్నారని మహేశ్‌గౌడ్‌ ప్రశ్నించారు.

నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ కంటే రైతు మోసగాడు ఎవరుంటారని ప్రశ్నించారు. మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్‌ చేసిన ట్రోలింగ్‌లతో పద్మశాలీల గుండెలు పగిలిపోతున్నాయని మహేశ్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం పెట్టిన ఆ పోస్టింగ్‌పై కేటీఆర్, హరీశ్‌రావులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అసలు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ ఎక్కడున్నాడో చెప్పాలని మహేశ్‌గౌడ్‌ దుయ్యబట్టారు. సమావేశంలో ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్, టీపీసీసీ నేతలు సామా రామ్మోహన్‌రెడ్డి, సంధ్యారెడ్డి, భవానీరెడ్డి, బండారి శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)