Breaking News

చంద్రబాబూ.. ఇవేం మాటలు?: టీజేఆర్‌

Published on Sun, 01/18/2026 - 15:56

సాక్షి, తాడేపల్లి: సంతాప సభలో చంద్రబాబు సైతాన్ మాటలు మాట్లాడారని.. హత్యా రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబేనని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండేది కేవలం 700 రోజులే.. ఈలోపు వీలైతే మంచి చేయాలే తప్ప హత్యా రాజకీయాలు చేయొద్దంటూ హితవు పలికారు.

‘‘వంగవీటి రంగా నుంచి సాల్మన్ హత్య వరకు అనేక మంది చావులకు చంద్రబాబే కారణం. ఎన్టీఆర్‌ని పదవీచ్యుతుని చేసి ఆయన మరణానికి కారణమయ్యారు. చంద్రబాబుకు వయసు పెరిగినా బుద్ధి రావటం లేదు. లక్ష్మీపార్వతి తాళిబొట్టును తెంచిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ బతికి ఉండగా ఆయన్ను చిత్రహింసలకు గురిచేశారు. వంగవీటి మోహనరంగాను హత్య చేయించింది ఎవరు?. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి తాళి బొట్టు తెంచింది ఎవరు?. పిన్నెల్లిలో సాల్మన్ భార్య తాళిని తెంచింది ఎవరు?’’ అంటూ  టీజేఆర్‌ నిలదీశారు.

‘‘చంద్రబాబు అంతటి నీచుడు రాజకీయాల్లో ఉండటం ఏపీ ప్రజల దురదృష్టకరం. ఎన్టీఆర్ జీవిత చరిత్ర చదివితే చంద్రబాబు నీచ బతుకు తెలుస్తుంది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి ఎందుకు రానీయలేదు?. సాల్మన్‌ను హత్య చేసిన వారిని శిక్షించమని కోరాం. ఆ కుటుంబాన్ని ఆదుకోమని కోరాం. కానీ దేనికీ చంద్రబాబు అంగీకరించలేదు. సాల్మన్‌ని చంపిందే కాకుండా కులాల పేరుతో మాట్లాడతారా?

..టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కుల అహంకారంతో మాట్లాడుతున్నారు. అధికారం శాశ్వతం కాదని యరపతినేని గుర్తుంచుకుంటే మంచిది. రాజధానిలో అడుగుకు పది వేలు ఎందుకు ఖర్చు చేస్తున్నారని అడిగితే తప్పా?. రాజధాని పేరుతో విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. చంద్రబాబుకు రాజధానిలో ఇల్లే లేదు. గూగుల్ డేటా సెంటర్‌ని రాజధానిలో ఎందుకు పెట్టలేదు?. కియో మోటర్స్ రాజధానిలో ఎందుకు పెట్టలేదు?. రాజధాని రైతులను తీవ్రంగా అన్యాయం చేశారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ అంటేనే జగన్ గుర్తుకు వస్తారు. దానిని కూడా చంద్రబాబు క్రెడిట్ చోరీ చేయటానికి ప్రయత్నించారు.

..సంక్రాంతి పండుగ పేరుతో ప్రజా ధనాన్ని లూటీ చేశారు. మద్యం సీసా మీద వంద రూపాయలు ఎక్కువ వసూలు చేసి దోపిడీ చేశారు. ఆ సొమ్మంతా చంద్రబాబు, లోకేష్ జేబులో వేసుకున్నారు. చంద్రబాబు అలివికాని అప్పులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల మీద ఒక్కొక్కరి మీద పది లక్షల భారం వేశారు. కూటమి నేతల వలనే రాష్ట్రంలోకి యథేచ్ఛగా డ్రగ్స్, గంజాయి దిగుమతి అవుతున్నాయి’’ అని సుధాకర్‌బాబు మండిపడ్డారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)