Breaking News

సీఎంకు, డిప్యూటీ సీఎంకు ఇంకా బుద్ధి రాలేదు: ఆర్కే రోజా

Published on Sat, 01/11/2025 - 13:25

చిత్తూరు, సాక్షి:  తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా కారకులపై ఇంతదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూటమి సర్కార్‌పై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా మండిపడ్డారు. ఈ కేసులో మొదటి ముద్దాయిగా చంద్రబాబు పేరునే చేర్చాలని ఆమె డిమాండ్‌ చేస్తున్నారు. నగరిలో శనివారం ఆమె మాట్లాడుతూ.. 

‘‘సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో ఒకరు చనిపోతే.. 14 మందిపై అక్కడి పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. అలాంటిది తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయారు. 60 మంది గాయపడ్డారు. ఘటన జరిగింది మూడు రోజులు గడిచింది.  అయినా ఇంకా చర్యలు కనిపించడం లేదు. చంద్రబాబు, టీటీడీ చైర్మన్‌, ఈవో, ఏఈవో, ఎస్పీ.. కారకులైన అందరిపైనా కేసు నమోదు చేయాలి. తిరుపతి తొక్కిసలాట ఘటనలో సీఎం చంద్రబాబును మొదటి ముద్దాయిగా చేర్చాలి. 

..   తొక్కిసలాట ఘటన(Stampede Incident) వల్ల భక్తులు తిరుమలకు రావడం లేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ఇంత జరిగినా బుద్ధి రాలేదు. అసలైన నిందితులపై చర్యలు తీసుకోకపోగా.. ఇంకా కాపాడాలనే చూస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తోంది. అయినా టోకెన్‌ సిస్టమ్‌ ఎందుకు తీయలేదు? అని ప్రశ్నించారామె. 

పవన్‌కు సూటి ప్రశ్న
‘‘సంధ్యా థియేటర్‌ ఘటనలో అల్లు అర్జున్‌కు మానవత్వం లేదని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మరి గేమ్‌ ఛంజర్‌ ఈవెంట్‌కు వెళ్లి ఇద్దరు చనిపోతే.. బాధిత కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు. అల్లు అర్జున్‌కు ఉన్న మానవత్వం కూడా మీకు లేదా?. లడ్డూ వ్యవహారంలో చేయని తప్పునకు కాషాయం కప్పేసుకుని మాట్లాడారు. మరి తిరుపతిలో ఇంత ఘోరం జరిగితే ఇప్పుడేం మాట్లాడరే?. తప్పు చేసిన వాళ్లు ఫలానా వాళ్లే అని మీరే చెబుతున్నారు. మరి వాళ్ల తాట ఎందుకు తీయడం లేదు’’ అని రోజా ప్రశ్నించారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)