Breaking News

సెల్ఫీ.. ఓ సెల్ఫ్‌ గోల్‌!.. బాబు బాటలో టీడీపీ తమ్ముళ్లు

Published on Thu, 04/13/2023 - 04:44

ఇచ్ఛాపురం రూరల్‌: ఎవరో చేసిన పనులను తాము చేసినట్టుగా చెప్పుకోవడం టీడీపీ అధినేత చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు టీడీపీ శ్రేణులు కూడా ఈ విషయంలో అధినేతను అనుసరిస్తున్నారు. టీడీపీయేతర ప్రభుత్వాలు చేసి­న అభివృద్ధి పనులను తాము చేసినట్టుగా చెప్పుకొంటూ సెల్ఫీ చాలెంజ్‌లు చేస్తూ జనంలో నవ్వులపాలవుతున్నా­రు. ‘2018లో అప్ప టి సీఎం చంద్రబాబు హయాంలో బొడ్డబడలో రూ.7 కోట్లతో రోడ్‌ కమ్‌ బ్రిడ్జి నిర్మాణం చేశాం.

ఈ క్రమంలో చాలెంజ్‌ చేస్తున్నా.. వైఎస్సార్‌సీపీ నుంచి ఎవరైనా సవాల్‌ను స్వీకరించాలి’ అంటూ మంగళవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బొడ్డబడ వంతెన దిగువన ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ విసిరిన సెల్ఫీతో సవాల్‌ ఎల్లో మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లో రావడంతో బొడ్డ­బడ గ్రామస్తు లు అవాక్కయ్యారు. సొమ్మొకడిది.. సో­కొకడిది.. అన్న చందంగా వ్యవహరిస్తున్న టీడీపీ నాయకుల తీరుపై వా రు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి వంతెన నిర్మించాలంటూ టీడీపీ హ­యాంలో వందలాది వినతి పత్రాలిచ్చినా బుట్టదాఖలు చేశారని గుర్తుచేసుకున్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అప్ప­టి కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి చొరవ­తో 2014లో రూ.7 కోట్ల కేంద్ర నిధులతో వంతెన పనుల­కు ప్రారంభోత్సవం చేసి.. నిర్మాణాన్ని మొదలు పెట్టారు. అనంతరం టీడీపీ ప్రభు­త్వం రావడంతో కాంగ్రెస్‌ ప్రభు­త్వం నిరి్మంచిన ఆ వంతెనను 2018 మే 18న టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రారంభించారు.

బ్రిడ్జి నిర్మా­ణం పూర్తయిన అనంతరం ఎన్నో ఏళ్ల తమ కల నెరవేర్చినందుకు గ్రామస్తులు డాక్టర్‌ కిల్లి కృపారాణికి సన్మానం కూడా చేశారు.  ఎవరో నిరి్మంచిన బ్రిడ్జికి ప్రారంబోత్స­వం చేసి.. ఇది తామే కట్టామంటూ టీడీపీ నేతలు సెల్ఫీ చాలెంజ్‌లు విసరడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. అవునులే ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా! చంద్రబాబుదీ ఇదే తంతు కదా!.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)