Breaking News

నడిరోడ్డుపై కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు?: వైఎస్‌ జగన్‌

Published on Tue, 06/03/2025 - 13:03

సాక్షి,  తెనాలి: రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో రాష్ట్రం అదుపు తప్పిందని.. పోలీస్‌ వ్యవస్థ దిగజారిపోయిందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం తెనాలిలో పర్యటించిన ఆయన.. పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో చంద్రబాబు పోలీస్‌ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారు. మాజీ మంత్రులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. రెడ్‌బుక్‌తో వేధించి హింసిస్తున్నారు. పోలీస్‌ వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటనే సాక్ష్యం. 

తెనాలి పోలీసుల చేతిలో దళితులు, మైనారిటీల ముగ్గురు పిల్లలు దెబ్బలు తిన్నారు. రాకేష్ హైదరాబాద్‌లో జొమాటోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.  ఆ యువకుడు తెనాలిలోనే ఉండడం లేదు. పాత కేసులో వాయిదా కోసం తెనాలికి వచ్చాడు. రాకేష్‌ను చూడడానికి అతని స్నేహితులు వచ్చారు. వాళ్లు కూడా మంగళగిరి నుంచి వచ్చారు. జాన్‌ విక్టర్‌ జూనియర్‌ అడ్వకేట్‌. బార్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం కూడా ఉంది. 

ఐతా నగర్‌లో  సివిల్ డ్రెస్‌లో ఉన్న కానిస్టేబుల్ ఎవరితో గోవడ పడుతుంటే ఈ యువకులు అడ్డుకున్నారు. గొడవపడుతున్న కానిస్టేబుల్‌ను వీళ్లు ప్రశ్నించారు. కేవలం కానిస్టేబుల్‌ను ప్రశ్నించడం వీళ్లు చేసిన తప్పా?. ఏప్రిల్‌ 24న కానిస్టేబుల్‌ను యువకులు ప్రశ్నించారు. 25న పోలీసులు మంగళగిరి వెళ్లి జాన్‌ విక్టర్‌, కరీముల్లాను కొట్టుకుంటూ తీసుకొచ్చారు. తెనాలి పీఎస్‌లో కూడా పడేసి కొట్టారు. ఏప్రిల్‌ 26న ఐతానగర్‌లో నడిరోడ్డు మీద పడేసి ముగ్గురిని చితకబాదారు. 

కొట్టొద్దని వేడుకున్నా పోలీసులు వదల్లేదు. యువకుల పరువు ప్రతిష్టలతో ఆడుకుంటూ పడేసికొట్టారు.  విక్టర్ జేబులో కత్తి పోలీసులే పెట్టారు. ఈ వ్యవహారంలో తెనాలి టూటౌన్‌ సీఐ, మరో పీఎస్‌ సీఐ కూడా ఉన్నారు. ఇద్దరూ వీఆర్వో సమక్షంలో పంచనామా రాసుకున్నారు. అరెస్ట్‌ చేసిన వాళ్లను సకాలంలో కోర్టు ముందు ప్రవేశపెట్టలేదు. ఇది చట్టాన్ని ఉల్లంఘించడం కాదా? అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. 

ఈ ఘటన జరిగిన తర్వాతే ముగ్గురి మీద  రౌడీషీట్‌ తెరిచారు. పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారనేది అర్థమవుతోంది. పోలీసులే తీర్పులు ఇస్తున్నారు. జరుగుతున్నది అన్యాయం అని తెలిసి కూడా.. ఎల్లో మీడియా బ్యాచ్‌ దారుణంగా కథనాలు ఇచ్చింది. గంజాయి బ్యాచ్‌, రౌడీ షీటర్లంటూ పరువు తీస్తూ కథనాలు ఇచ్చాయి. 

కేసులు ఎవరి మీదా అయినా ఉండొచ్చు. ఆ వ్యహారాన్ని కోర్టులు చూసుకుంటాయి. చంద్రబాబుపై 24 కేసులున్నాయని నడిరోడ్డు మీదకు తీసుకొచ్చి తన్నడం ధర్మమేనా?. పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తారా?. ఇలా చేసే నైతికత పోలీసులకు ఉందా? ఇది ధర్మమేనా?. పరువు, ప్రతిష్టలు తీసే హక్కు పోసులకు ఉందా?. నడిరోడ్డుపై కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? పోయిన ఆ కుటుంబాల పరువును ఎవరు తీసుకొస్తారు? అని జగన్‌ ప్రశ్నించారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)