Breaking News

అడ్లూరినేం అనలేదు.. ఇది బీఆర్‌ఎస్‌ కుట్ర: పొన్నం

Published on Tue, 10/07/2025 - 12:11

తెలంగాణ రాజకీయాన్ని కాంగ్రెస్‌ (Congress) మంత్రుల మధ్య విభేదాలు హీటెక్కించాయి. తనను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్‌ (Ponnam Prabhakar), వివేక్‌పై (G.Vivek) సంచలన ఆరోపణలకు దిగారు. ఈ క్రమంలో.. మంత్రి పొన్నం స్పందించారు. 

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ వీడియో(Adluri Laxman Kumar) నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్‌ ద్వారా స్పందించారు. ‘‘అడ్లూరిపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నా వాఖ్యలు వక్రీకరించారు. ఇదంతా బీఆర్‌ఎస్‌ కుట్ర. ఆ పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు’’ అని అన్నారాయన. 

ఇదిలా ఉంటే.. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ ఇప్పటికే ఇద్దరు మంత్రులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మంత్రి శ్రీధర్‌ బాబు పొన్నం వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.

అడ్లూరి వీడియోలో..  ‘నేను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదు. పొన్నం ప్రభాకర్ మాదిరిగా నాకు అహంకారంగా మాట్లాడటం రాదు. నా వద్ద డబ్బులు లేవు. పొన్నం ఆయన తప్పు తెలుసుకుంటాడు అని అనుకున్నాను. నేను కాంగ్రెస్ జెండా నమ్ముకున్న వాడిని. మంత్రిగా మూడు నెలల పొగ్రెస్ చూసుకోండి. నేను మాదిగను కాబట్టి నాకు మంత్రి పదవి వచ్చింది. పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి. నేను మంత్రి కావడం, మా సామజిక వర్గంలో పుట్టడం తప్పా?..  

.. నేను త్వరలోనే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ని కలుస్తా. నేను పక్కన కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోతున్నాడు. నేను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదు. ఇది ఎంత వరకు కరెక్ట్‌’ అంటూ ప్రశ్నలు సంధించారు. దళితులు అంటే చిన్న చూపా? అని ప్రశ్నించారు. దీంతో, కాంగ్రెస్‌ పార్టీలో ఆయన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి.

పొన్నం పేరిట వైరల్‌ అయిన వీడియోలో.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇన్‌చార్జి మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశానికి అందరూ వచ్చారు. కానీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకే చెందిన సహచర మంత్రి ఒకరు సమయానికి రాలేకపోయారు. దీంతో పొన్నం అసహనానికి లోనయ్యారు. పక్కనే ఉన్న మంత్రి వివేక్‌ చెవిలో.. ‘మనకు టైం అంటే తెలుసు.. జీవితమంటే తెలుసు.. వారికేం తెలుసు ఆ..దున్నపోతు గానికి’ అంటూ పొన్నం అన్నట్లు ఉంది. 

ఇదీ చదవండి: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక వేళ.. బిగ్‌ ట్విస్ట్‌

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)