Breaking News

ఉన్నమాట అంటే ఉలిక్కిపడుతున్నారు.. ఏపీ మంత్రులపై హరీశ్‌రావు

Published on Tue, 04/18/2023 - 07:59

సాక్షి, సిద్దిపేట: కొందరు ఏపీ మంత్రులు ఎగిరెగిరిపడుతున్నారని.. ఉన్నమాట అంటే.. వారు  ఉలిక్కిపడుతున్నారని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.  సోమవారం సిద్దిపేట అర్బన్‌ మండల బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి చెందిన మేస్త్రీలు ఇటీవల తనను కలిసినప్పుడు తెలంగాణ అభివృద్ధిలో చెమట చుక్కలు కార్చిన ప్రతి ఒక్కరూ తమ బిడ్డలేనని చెప్పానన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఇక్కడే ఉండాలని వారికి సూచించానన్నారు.

‘ఆనాడు ఏపీకి ప్రత్యేక హోదా కోసం మీ నాయకత్వం పోరాడతాం అన్నది. ఈరోజు ఎందుకు మౌనం వహిస్తున్నారు? విశాఖ ఉక్కు కోసం ఎందుకు పోరాడటం లేదు? పోలవరం పనులు ఎందుకు పూర్తికావడం లేదన్నాను. ఇందులో ఏమైనా తప్పుందా?. నేను ప్రజల పక్షాన మాట్లాడా. ఏపీ ప్రజలు, మంత్రుల గురించి తప్పుగా మాట్లాడలేదు’ అని హరీశ్‌రావు అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, వివిధ సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కేసీఆర్‌ పాలన ఉందన్నారు.

కుర్రోకుర్రు.. కేసీఆర్‌ పీఎం.. హరీశ్‌రావు సీఎం
అత్మీయ సమ్మేళనంలో సిద్దిపేట అర్బన్‌ మండలం నాంచారిపల్లికి చెందిన చిన్నారి మైత్రి సభావేదికపై కుర్రో కుర్రు అంటూ మంత్రి హరీశ్‌రావుకు సోది చెప్పింది. హరీశ్‌రావుకు నరదృష్టి బాగా ఉందని పేర్కొంది. నరంలేని నాలుక 40 మాటలు అంటుందని.. అవన్నీ పట్టించుకోవద్దని సూచించింది. తన నోరు సత్యమే పలుకుతుందని.. తన మాట తప్పదంటూ దేశానికి కేసీఆర్‌ పీఎం కావాలనుకుంటే హరీశ్‌రావు రాష్ట్రానికి సీఎం కావాలని ఆ చిన్నారి సోది చెప్పింది.
చదవండి: తెలంగాణలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్‌ నేతలను ఆరా తీసిన రాహుల్‌

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)