Breaking News

జూబ్లీహిల్స్‌ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్‌ కొత్త డ్రామాలు: పొన్నం

Published on Mon, 10/27/2025 - 13:44

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. కాంగ్రెస్‌ మంత్రులు, మాజీ మంత్రి హరీష్‌ అనే విధంగా రాజకీయం నడుస్తోంది. తాజాగా హరీష్‌ వ్యాఖ్యలకు మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కౌంటరిచ్చారు. 

మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ..‘బీఆర్‌ఎస్‌ అనవసరపు రాద్ధాంతం చేస్తోంది. జూబ్లీహిల్స్‌ ఎన్నికలో ఓట్ల కోసమ బీఆర్‌ఎస్‌ డ్రామాలు ఆడుతోంది. బీఆర్‌ఎస్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోంది. గులాబీ నేతల తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. రాహుల్‌ గాంధీ గురించి మాట్లాడే స్థాయి హరీష్‌ రావుకు లేదు. బీఆర్‌ఎస్‌ ఎన్నో హామీలను ఎగ్గొట్టింది. ఆటో కార్మికులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటుంది అని అన్నారు.

మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. హరీష్‌ రావు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. అంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు.  బలహీన వర్గాల మంత్రులు ఉన్న కేబినెట్‌ను దండుపాళ్యం బ్యాచ్ అని హరీష్‌ రావు ఎలా అంటారు. రాష్ట్ర మంత్రి వర్గం దండుపాళ్యం బ్యాచ్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రివర్గం స్టువర్ట్ పురం దొంగలా అని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్న కేబినెట్‍పై చేసిన వ్యాఖ్యలకు గాను హరీష్‌ రావు తక్షణమే క్షమాపణలు చెప్పాలి.

కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్‌ రావు అవినీతికి పాల్పడ్డారంటూ కవిత చేసిన ఆరోపణలపై చర్చకు రమ్మంటే తొక ముడిచిన హరీష్‌ రావు.. ఇప్పుడు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను చర్చకు పంపుతానంటున్నారని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు చర్చకు రావడానికి మేము సిద్ధమేనన్నారు. కేసీఆర్ మీ అల్లుడ్ని కంట్రోల్‍లో పెట్టుకోవాలని సూచించారు. కేసీఆర్ కు తెలియకుండా హరీష్‌ రావు 28 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేశారు. అందువల్లే రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా హరీష్‌ రావుకు కేసీఆర్ వెంటనే మంత్రి పదవి ఇవ్వలేదు’ అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)