Breaking News

వికసిత్‌ భారత్‌ కాదు.. సంక్షోభ భారత్‌ను సృష్టిస్తున్నారు

Published on Thu, 01/08/2026 - 14:38

సాక్షి, హైదరాబాద్‌: అధికారం ఉంది కదా అని మోదీ సర్కార్‌ ఇష్టానుసారం వ్యవహరిస్తోందని.. పేదలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం మార్పునకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ చేపట్టిన దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా.. గురువారం గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రేవంత్‌ మాట్లాడారు. 

.. బ్రిటీష్‌ పాలన తరహాలో మోదీ పాలన ఉంది. ఎన్డీయే కూటమికి అనుకున్నంత మెజారిటీ రాకపోవడంతో రాజ్యాంగాన్ని మార్చలేకపోయారు. అందుకే వేరే రూపంలో హక్కులను కాలరాస్తున్నారు. ఓటు హక్కు తీసేసే కుట్రలో భాగంగా ఎస్‌ఐఆర్‌ తీసుకొచ్చారు. కోట్లాది మంది పేదలను దేశ పౌరులే కాదని చూపించేందుకు కుట్రపూరితంగా  ప్రయత్నిస్తున్నారు. రాజ్యాంగాన్ని బీజేపీ రద్దు చేయబోతోంది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడబోతోంది

ఉపాధి హామీ పథకానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. భూమిలేని పేదలకు ఆహార భద్రత కల్పించేందుకే కాంగ్రెస్‌ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం వల్ల గ్రామాల్లో విప్లవాత్మక మార్పులొచ్చాయి. వలసలు ఆగిపోయాయి.. వెట్టిచాకిరీ ఆగింది. దేశంలో 80 శాతం ప్రజలు ఈ పథకం ఆధారపడి బతుకుతున్నారు. అలాంటి పథకాన్ని నిర్వీర్యం చేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పథకాన్ని మార్చి పేదలకు అన్యాయం చేస్తున్నారు. పేదలపై కక్ష పూరితంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అదానీ, అంబానీలకు తక్కువ ధరకు కూలీలు దొరకడం లేదని పథకాన్ని మారుస్తున్నారు. కార్పొరేట్‌ కంపెనీల కోసమే ఇలా చేస్తున్నారు. 

గతంలో వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. ఆ నల్ల చట్టాలను ఉపసంహరించుకునేలా చేయడమే కాకుండా మోదీతో జాతికి క్షమాపణ చెప్పించింది కాంగ్రెస్‌. ఇప్పుడు అదే పని చేయబోతున్నాం. మోదీ క్షమాపణలు చెప్పేంత వరకు వదిలేది లేదు. ఉపాధి హామీ చట్టంలో మార్పులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశాం. ఈ నెల 20 నుంచి గ్రామ సభలు నిర్వహిద్దాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ నేను కూడా ఓ మండలం బాధ్యత తీసుకుంటా. అన్ని మండలాలకు ఒక్కొకకకరు బాధ్యత తీసుకోవాలి. ఫిబ్రవరి 3 నుంచి అన్ని జిల్లాల్లో రోజుకు లక్ష మందితో సభ పెడదాం. హైదరాబాద్‌ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో సభలు పెడతాం. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించేంత వరకు మోదీ సర్కార్‌పై యుద్ధం ఆగదు.. 

బీఆర్‌ఎస్‌ను వరుసగా అన్ని ఎన్నికల్లో ఓడించాం. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ గెలిచి తీరతాం. బీఆర్‌ఎస్‌, బీజేపీలకు రాజకీయాలే తప్ప ప్రజాసమస్యలు పట్టడం లేదు.  వికసిత్‌ భారత్‌ కాదు.. సంక్షోభ భారత్‌ను సృష్టిస్తున్నారు అని రేవంత్‌ అన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)