Breaking News

రేవంత్‌రెడ్డిపై బండి సంజయ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Published on Fri, 06/02/2023 - 14:37

సాక్షి, హైదరాబాద్‌: రేవంత్‌రెడ్డిలా పార్టీలు మారడం తనకు చేతకాదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓటుకు నోటు కేసులో డబ్బులు పంచడం నావల్ల కాదు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని ఎలా నడుపుతున్నాడో జానారెడ్డి, కోమటిరెడ్డి, జాగ్గారెడ్డిని అడిగితే తెలుస్తుందన్నారు. కాంగ్రెస్‌ ఎవరి చెప్పు చేతల్లో ఉందో?. మా దగ్గర సీనియర్లు బాస్‌లు.. అదే కాంగ్రెస్‌లో హోంగార్డ్స్‌’’ అంటూ బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు.

‘‘హుజురాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాం. పార్టీ నడపరాకుంటే ఎలా గెలుస్తాం. మేము గెలుపు పరంపరం కొనసాగిస్తున్నాం.. వారు ఓటమి పరంపర సాగిస్తున్నారు. డిపాజిట్లు కోల్పోయిన పరంపర సాగుతోంది. ముసుగులు వేసుకుని తిరిగే పార్టీ మాది కాదు.  ఓవైసీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనలేదు. దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. ఎంఐఎం పార్టీని నిజమైన తెలంగాణ ముస్లింలు వ్యతిరేకించాలి’’ అని బండి సంజయ్‌ అన్నారు.
చదవండి: కాంగ్రెస్‌కు షాక్‌.. రేవంత్‌పై ఆరోపణలతో బీజేపీలో చేరిక

‘‘తెలంగాణ ఆవిర్భావంలో జెండా ఎగురవేయనోడికి తెలంగాణలో పోటీ చేసే అర్హత లేదు. జెండా ఎగురవేయనందుకు కేసీఆర్‌కు దమ్ముంటే దారుస్సలాంకు తాళం వేయాలి. 17 సెప్టెంబర్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాం. తెలంగాణ ఆవిర్భవాన్ని కూడా అధికారికంగా నిర్వహించాం. క్రెడిట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదే.. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిర్వహించేలా చేశారు’’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)