Breaking News

మళ్లీ గట్టు దాటి.. తీన్మార్‌ మల్లన్న హాట్‌ కామెంట్స్‌

Published on Mon, 02/24/2025 - 15:59

కరీంనగర్‌, సాక్షి: అధికార కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌ కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న(Teenmar Mallanna) రగడ కొనసాగుతోంది. ఒకవైపు నవీన్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలనే గొంతుకలు పెరుగుతున్న వేళ.. ఆయన మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ షోకాజ్‌ నోటీసులు ఇచ్చినా కూడా తగ్గేదేలే అంటున్నారు. తాజాగా..

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం(MLC Election Campaign) లో కాంగ్రెస్‌ది, తనది వేర్వేరు దారన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డికి మద్ధతుగా సీఎం రేవంత్‌ రెడ్డి మంత్రుల బృందంతో ఇవాళ కరీంనగర్‌లో సభకు హాజరవుతున్నారు. అయితే అంతకంటే ముందే.. 

అదే కరీంనగర్(Karimnagar) వేదికగా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ హాజరైన బీసీ జేఏసీ మీటింగ్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌ ప్రత్యక్షం కావడం, తాజా పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం  తీవ్ర చర్చనీయాంశమైంది. 

‘‘జానారెడ్డి కళ్లల్లో ఆనందం కోసం చిన్నారెడ్డి నాకు షోకాజ్‌ నోటీస్ పంపించారు. నేను ఈ బీసీ జేఏసీ సమావేశానికి వస్తే ఓ పార్టీ అభ్యర్థి బాధపడుతున్నారు. మరి అదే అభ్యర్థి.. నాకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చినప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు?’’ అని ఎమ్మెల్సీ నవీన్‌ నిలదీశారు.

.. రాహుల్ గాంధీ స్పిరిట్‌తోనే బీసీ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్నా. కానీ, నేను ఇలా చేయడం  కాంగ్రెస్ లో మరి కొన్ని వర్గాలకు నచ్చడం లేదు. మీకు పడకపోతే నేను బీసీ ఉద్యమాన్ని ఆపుతానా?.. ఇస్సా, ఇజ్జత్, హుకూమత్ కోసమే బీసీ ఉద్యమమం అంటూ తీన్మార్‌ మల్లన్న హాట్‌ కామెంట్స్ చేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)