Breaking News

ఉండి అభ్యర్థిని మారిస్తే ఉండేలుదెబ్బే

Published on Sun, 04/07/2024 - 04:48

సాక్షి, భీమవరం/ పాలకొల్లు సెంట్రల్, సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా రెండో రోజు పర్యటనలో చంద్రబాబుకు సొంత పార్టీ శ్రేణుల నుంచి నిరసన సెగ తగిలింది. ఉండి నియోజ­కవర్గంలో అభ్యర్థిని మారుస్తున్నట్టు ఇచ్చిన సంకేతాలపై కార్యకర్తలు ఆయనపై తిరగబడ్డారు. గత ఎన్నికల్లో సైకిల్‌ గుర్తును తగలబెట్టిన వ్యక్తికి సీటు ఎలా ఇస్తారని ప్రశ్నించిన తెలుగు తమ్ముళ్లు.. రామరాజును కాదని రఘురామకృష్ణరాజుకు టికె­టిస్తే చిత్తుగా ఓడిస్తామంటూ చంద్రబాబు ఎదుటే తేల్చిచెప్పారు. ఉండి నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మంతెన రామ­రాజు పేరును చంద్రబాబు మొదటి జాబితాలోనే ప్రకటించారు.

ఈ మేరకు రామరాజు ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. ఉండి సీటు తనదేనని, రెండు మూడు రోజుల్లో చంద్రబాబు ప్రకటిస్తారని రఘురామకృష్ణంరాజు తన అనుచరులతో చెబుతు­న్నట్టుగా జరుగుతున్న ప్రచారం ఎమ్మెల్యే రామరా­జు వర్గానికి మింగుడు పడలేదు. ఈ తరుణంలో అభ్యర్థి మార్పుపై చంద్రబాబు ఇచ్చిన సంకేతాలు పార్టీ క్యాడర్‌లో అగ్గిరాజేశాయి. జిల్లా పర్యటనలో భాగంగా శనివారం పాలకొల్లు ఎస్‌ కన్వెన్షన్‌ హాలులో పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన కూటమి అభ్యర్థులు, ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు.

సమావేశానికి ఉండి ఎమ్మెల్యే రామరాజుతోపాటు రఘురామకృష్ణరాజు హాజర­య్యారు. ఈ సందర్భంగా రామరాజుకు ప్రచారం స్పీడు తగ్గించాలని చంద్రబాబు చెప్పినట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ సమాచారంతో ఉండి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే రామరాజు అనుచరులు పాలకొల్లులోని ఫంక్షన్‌ హాలు వద్దకు చేరుకుని బయటే బైఠాయించి నిరస­నకు దిగారు. రామరాజును మారిస్తే తమ సత్తా చూపిస్తామని, ఉండిలో పార్టీ విజయాలకు బ్రేక్‌ వేస్తామని హెచ్చరించారు. సమావేశం అనంతరం బయటకు వచ్చిన చంద్రబాబును అడ్డుకునే యత్నం చేశారు. చంద్రబాబు వారికి సమాధానం చెప్పకుండా సెక్యూరిటీ సిబ్బంది సాయంతో వెళ్లిపోయారు. ఉండి కూటమి అభ్యర్థి, ఎమ్మెల్యే మంతెన రామ­రాజు మాట్లాడుతూ చంద్రబాబు, పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎన్నోఏళ్లుగా పార్టీ విజయానికి పనిచేస్తున్న కార్యకర్తల మనో­భావాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.  

బ్రోకర్‌కు టికెట్టా!
రాజకీయ బ్రోకర్‌గా, వివాదాస్పదుడిగా ముద్రప­డి­న రఘురామకృష్ణరాజుకు ఉండి సీటు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధపడడమేమిటని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే అసలు ఈ ఉదంతంలో చంద్రబాబు ఆలోచనలు వేరుగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరఫున నరసాపురం ఎంపీగా గెలిచిన రఘు­రామ ఆ పార్టీలో తన ఆటలు సాగ­క­పోవడంతో కొద్దినెలలకే రాజకీయ బ్రోకర్‌గా మారి టీడీపీకి, చంద్రబాబుకు ఆప్తుడిగా మారి­పోయారు. ఆయనకు అనుకూలంగా పనిచేశారు.

చంద్రబాబు చేసిన కుట్రలన్నీ రఘురామకు తెలుసని, అందుకే ఇప్పుడు ఆయనకు సీటు ఇవ్వకపోతే ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందనే ఆందోళనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది.   రఘురామ కూటమి తరఫున నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఏడాది క్రితమే ప్రకటించారు. బీజేపీలో చేరి నర్సాపురం ఎంపీ సీటు తెచ్చుకోవాలని కలలు కన్నారు. కానీ బీజేపీ అందుకు అంగీకరించలేదు. దీంతో రఘురామకృష్ణంరాజు ఆశలు అడియాసలయ్యాయి. ఈ నేపథ్యంలో తన సంగతి తేల్చాలని చంద్రబాబుపై రఘురామ ఒత్తిడి తెచ్చారు. ఇంతకాలం అన్ని పనులకూ ఆయనను ఉపయోగించుకున్న కారణంగా రఘురామ బాధ్యత చంద్రబాబుపైనే పడింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)