Breaking News

టీటీడీ.. మాకే కావాలి! పట్టుబడుతున్న టీడీపీ, జనసేన

Published on Wed, 07/10/2024 - 04:31

సాక్షి, అమరావతి:  తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌ పదవి కోసం కూటమి పార్టీలు పోటీ పడుతున్నాయి. టీడీపీ, జనసేన నేతలు ఆ పదవి కోసం గట్టిగా పట్టుపడుతున్నారు. టీడీపీ నుంచి అశోక్‌ గజపతిరాజు, వేమిరెడ్డి ప్రశాంతి, రఘురామకృష్ణరాజు రేసులో నిలవగా.. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ సోదరుడైన నాగబాబుకే టీటీడీ చైర్మన్‌ పదవి ఇవ్వాలంటూ ఆ పార్టీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. తమ పారీ్టకి చెందిన సీనియర్‌ నేత ఎవరికైనా ఆ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.

కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు పేరును ఆయన పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అశోక్‌ గజపతిరాజు ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన కుమార్తె అదితికి అవకాశం కలి్పంచి.. తాను పోటీ నుంచి వైదొలిగారు. దీంతో ఆయనకే ఈ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన పూర్తికాలం ఆ పదవి కోసం సమయం కేటాయించకపోవచ్చని, అలాగే అందరికీ అందుబాటులో ఉండడం కష్టమనే అభిప్రాయం టీడీపీ నేతల్లో నెలకొంది.

ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే కె.రఘురామకృష్ణరాజు పేరును కూడా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడం.. స్పీకర్‌ పదవి ఆశించినా అదీ రాకపోవడంతో ఆయన తనకు తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి కూడా రేసులో ఉన్నట్లు తెలిసింది. నెల్లూరు జిల్లాలో పార్టీ గెలుపు కోసం చాలా కష్టపడ్డామని.. తమకు టీటీడీ చైర్మన్‌ పదవి ఇవ్వాలని ఆమె కోరుతున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.  

నాగబాబు కోసం ఒత్తిడి! 
టీడీపీలోనే టీటీడీ చైర్మన్‌ పదవి కోసం ఎంతో మంది ఆశలు పెట్టుకోగా.. దాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు జనసేన పార్టీ పావులు కదుపుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ సోదరుడైన నాగబాబుకు ఆ పదవి ఇవ్వాల్సిందేనని జనసేన పార్టీ చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయనకు టీటీడీ చైర్మన్‌ పదవి ఖాయమైనట్లు సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. అనంతరం ఆ ప్రచారాన్ని ఖండించిన నాగబాబు.. అధికారిక ప్రకటన వస్తేనే ఇలాంటి వాటిని నమ్మాలన్నారు. దీంతో నాగబాబుకు టీటీడీ చైర్మన్‌ పదవిపై ఆశ ఉన్నట్లు బయటపడింది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమైన నాగబాబు.. సర్దుబాటులో భాగంగా ఆ సీటును వదులుకున్నారు. దీంతో అన్నకు ఏదైనా మంచి పదవి ఇప్పించాలనే ఉద్దేశంలో పవన్‌కళ్యాణ్‌ ఉన్నట్లు తెలిసింది. అందులో భాగంగానే టీటీడీ చైర్మన్‌ పదవిని అడుగుతున్నట్లు సమాచారం. నెల రోజులుగా ఆ పోస్టు ఖాళీగా ఉన్నా కూడా ఆ పదవికి ఉన్న ప్రాధాన్యత.. పోటీ నేపథ్యంలో చంద్రబాబు ఏమీ తేల్చట్లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు టీటీడీ బోర్డులో కూడా తమ పారీ్టకి చెందిన వారిని సగం మందిని నియమించాలని జనసేన కోరుతున్నట్లు తెలిసింది. బీజేపీ కూడా మూడుకు తగ్గకుండా తమ వారిని బోర్డులో సభ్యులుగా నియమించాలని డిమాండ్‌ చేస్తోందని సమాచారం.

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)