Breaking News

అడ్డంగా దొరికిన టీడీపీ.. నకిలీ మద్యం కేసులో బలవంతపు వీడియో డ్రామా!

Published on Mon, 10/13/2025 - 19:09

సాక్షి,అమరావతి: నకిలీ మద్యం కేసులో చంద్రబాబు ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసింది. నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్ధన్‌ వీడియోతో మళ్లీ అడ్డంగా దొరికిపోయింది. వైఎస్సార్‌సీపీపై బురదజల్లాలని ప్రయత్నించి బుక్కైంది. జోగి రమేష్‌ను ఇరికించేందుకు ప్రయత్నించి అభాసుపాలైంది.

నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్ధన్‌రావు పోలీసుల అదుపులో ఉండగా.. ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోను ఎల్లోమీడియా ద్వారా టీడీపీ బయటకు వదిలింది. అరెస్టయినప్పుడు ఉన్న దుస్తులతోనే బలవంతంగా జనార్ధన్‌రావుతో వీడియో రికార్డింగ్‌ చేయించింది. ఆపై జనార్ధన్‌రావుతో జోగి రమేష్‌ పేరు చెప్పించింది.

జోగి రమేష్‌ చెబితేనే చేశానంటూ బలవంతపు స్టేట్మెంట్‌ ఇప్పిచ్చింది. అయితే,పోలీసుల అదుపులో ఉన్న జనార్ధన్‌ వీడియో రికార్డ్‌ ఎవరు చేశారనే దానిపై అనుమానాలు వ్యక్తం కాగా.. దారి తప్పిన కల్తీ మద్యం కేసు విచారణకు నిదర్శనంగా జనార్ధన్‌ వీడియో నిలిచింది. నకిలీ మద్యం రాకెట్‌లో టీడీపీ నేతలను కాపాడేందుకు ప్రభుత్వం బరితెగించింది.. నకిలీ మద్యం కేసులో కొత్త డ్రామాకు తెరతీయడం చర్చకు దారితీస్తోంది.

నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్ధరావు అరెస్టు అనంతరం, పోలీసులు విడుదల చేసిన రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు జోగి రమేష్‌ పేరు ప్రస్తావించలేదు. కావాలని ఇరికించేందుకు కూటమి సర్కార్‌ కొత్త కథలు అల్లుతోంది. అందుకు నిదర్శనంగా జనార్ధన్‌రావు దగ్గర ఫోన్‌ లేనప్పుడు వీడియో ఎవరు రికార్డ్‌ చేశారు? రిమాండ్‌ రిపోర్ట్‌లో ఎందుకు ఈ వీడియోను ప్రస్తావించలేదు? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)