Breaking News

టీడీపీ ఎమ్మెల్సీ వర్సెస్‌ మాజీ ఎమ్మెల్సీ!

Published on Sat, 01/18/2025 - 07:28

పులివెందుల రూరల్‌: వైఎస్పార్‌ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన ఇసుక టెండర్లలో బీటెక్‌ రవి అనుచరులు హంగామా సృష్టించిన విషయం సద్దుమణగక ముందే శుక్రవారం రాంగోపాల్‌ రెడ్డి వర్గీయుడు ప్రకాష్‌ను చితకబాది కిడ్నాప్‌ చేయడం కలకలం రేపింది.

నియోజకవర్గంలో చౌక దుకాణాలకు డీలర్లను నియమించేందుకు శుక్రవారం పులివెందులలోని అహోబిలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాత పరీక్ష నిర్వహించారు. ఎమ్మెల్సీ రాంగోపాల్‌ రెడ్డి వర్గీయుడైన వేంపల్లెకు చెందిన ప్రకాష్‌ స్థానికంగా దుకాణం కోసం ఈ పరీక్ష రాయడానికి వచ్చాడు. అంతలో వేంపల్లెలోని అదే వార్డుకు చెందిన టీడీపీ నాయకులు, బీటెక్‌ రవి అనుచరుడు రామమునిరెడ్డి, మరికొంత మంది అక్కడికి చేరు­కుని.. ప్రకాష్‌ను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డు­కున్నారు.

చితక బాది కిడ్నాప్‌ చేశారు. ఈ విష­యం తెలుసుకున్న రాంగోపాల్‌ రెడ్డి సతీమణి భూమిరెడ్డి ఉమాదేవి అనుచరులతో కలిసి పరీక్ష కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. ప్రకాష్‌ను విడిచి పెట్టే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని అక్కడికి వచ్చిన పోలీసులకు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో కొద్దిసేపటికి బీటెక్‌ రవి అనుచరులు ప్రకాష్‌ను వదిలేశారు. అనంతరం ఉమాదేవి మా­ట్లా­డుతూ.. ఒకే పార్టీలో ఉంటూ బీటెక్‌ రవి వర్గీయులు ఇలా చేయడం తగదని మండిపడ్డారు. టీడీపీకి చెడ్డపేరు వచ్చేలా చేస్తున్న వారిని ఉపేక్షించ­మని చెప్పారు. దాడి చేసిన వారిపై కేసు నమో­దు చేయాలని అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌లో ప్రకాష్‌తో కలిసి ఫిర్యాదు చేశారు.

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)