కూటమి నుంచి టీడీపీ ఎన్నిసార్లు బయటకు రాలేదు: జ్యోతుల నెహ్రూ

Published on Thu, 05/22/2025 - 13:23

సాక్షి, కాకినాడ: టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి ఎన్నాళ్లు ఉంటుంది.. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు.. కూటముల నుంచి ఎన్నిసార్లు బయటకు రాలేదు అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ప్రభుత్వంలో పదవులు ఎవరికి ఇస్తున్నారు?. పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుందని చెప్పుకొచ్చారు.

టీడీపీ కాకినాడ జిల్లా మహానాడులో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ..‘కాకినాడ జిల్లాలో పదవులు ఏ పార్టీకి వెళ్లాయో ఆలోచించండి. మెజారిటీ ఉన్న తెలుగుదేశం పరిస్థితి ఏంటి?. ఒక వ్యక్తికి రెండు పదవులు అవసరమా?.(కుడా చైర్మన్, డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు). కూటమిలో పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుంది. కూటమి ఎన్నాళ్లు ఉంటుంది.. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు. ఎన్నిసార్లు బయటకు రాలేదు.

టీడీపీతో పొత్తు వల్ల కమ్యూనిస్టు పార్టీలు నిర్వీర్యం అయిపోయాయి. అదే పరిస్థితి టీడీపీకి రాకుండా చూడాలి. నేను వాళ్లకు ఇవ్వకూడదు అని అనడం లేదు. మా నిష్పత్తి ప్రకారం టీడీపీకి కూడా ఇవ్వండి అంటున్నాను. ద్వితీయ శ్రేణి నేతలు తమ ఇంట్లో వారికి కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. మా వాటా పదవులు మాకు సక్రమంగా ఇవ్వండి’ అని డిమాండ్‌ చేశారు. 

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)