Breaking News

పవన్‌ ప్రకటనపై భగ్గుమన్న టీడీపీ

Published on Mon, 01/29/2024 - 04:26

మలికిపురం: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పోటీకి దిగుతారని ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ చేసిన ప్రకటనపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన మలికిపురంలో ఆదివారం జరిగిన సమావేశంలో రాజోలు ఎంపీపీ కేతా శ్రీను మాట్లాడుతూ.. రాజోలు టికెట్‌ జనసేనకు ఇస్తే ఎంపీపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి గొల్లపల్లి వెంటే వెళ్తానని ప్రకటించారు. పార్టీ నియోజకవర్గ బీసీ విభాగం అధ్యక్షులు కాండ్రేగుల లావణ్య భవాని మాట్లాడుతూ.. తాను కూడా తన పదవికి, పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

గొల్లపల్లి సూర్యారావు వైఎస్సార్‌సీపీ నుంచి లేదా ఇండిపెడెంట్‌గా పోటీ చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ నేత కుసుకుర్తి త్రినాథ్‌ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పరిస్థితిపై మాట్లాడటానికి అచ్చెన్నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఎవరని ప్రశ్నించారు. చివరగా గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కార్యకర్తల మనోభావాలను మరోసారి అధిష్టానానికి చెబుదామని, తరువాతే నిర్ణయం తీసుకుందామని అన్నారు.

నియోజకవర్గంలో రూ.1,400 కోట్ల అభివృద్ధి చేశామని, భువనేశ్వరిని అసెంబ్లీలో అవమానిస్తే ఇంటింటికీ తిరిగి ఖండించానని, అటువంటి తనపట్ల పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దామని అన్నారు. కాగా, జనసేనతో కలసి ఇప్పటివరకూ ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ.. ఈ సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పవన్‌ ఫొటో కానీ, నియోజకవర్గ సమన్వయకర్త గుండుబోగుల పెద్దకాపు ఫొటో కానీ వేయకపోవడం గమనార్హం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)